»   » భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ సెల్ఫీ... రెస్పాన్స్ కేక!

భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ సెల్ఫీ... రెస్పాన్స్ కేక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు స్టార్లలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఎఫ్‌బిలో కోటి 20 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఆయన్ను ఫాలో అవుతుంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు బన్నీ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.

తాజాగా బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి దిగిన ఓ సెల్పీ పిక్ పోస్టు చేసాడు. ఈ ఫొటో పోస్ట్ చేసిన గంటల్లోనే అభిమానుల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోటోకు హాఫ్ మిలియన్‌కు పైగా హిట్స్ వచ్చాయి.

రొమాంటిక్

అల్లు అర్జున్-స్నేహా రెడ్డి సెల్పీ ఎంతో రొమాంటిక్ గా ఉందని, చూడముచ్చటైన జంట అంటూ అభిమానులు, ప్రేక్షకులు దాదాపు 5 వేల కామెంట్లతో పొగడ్తలు గుప్పించారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ కులాలు, ప్రాంతాలు వేరైనా అలాంటివేమీ పట్టించుకోకుండా ఆదర్శ వివాహం చేసుకున్నారు ఇద్దరు. మార్చి 6, 2011లో పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది.

అయాన్

అయాన్

బన్నీ, స్నేహా అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు. మరో రేపు అయాన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అయాన్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను బన్నీ స్వయంగా అభిమానులతో పంచుకోనున్నారు.

అర్హ

అర్హ

గతేడాది బన్నీ దంపతులకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. "AR" jun & Sne "HA"... ARHA ఇలా తల్లితండ్రి పేరులోని అక్షరాలు కలిసేలా అర్హ అని పేరు పెట్టారు. హిందూ మతం ప్రకారం 'అర్హ' అంటే శివునికి ఉన్న పేర్లలో ఒకటని, అదే విధంగా ఇస్లాంలో 'శాంతి, నిర్మలమైన' అని అర్థం వస్తుందట.

English summary
Check out Allu Arjun And Sneha Reddy Selfie pic.this pic got the good response from fans. Allu Arjun married Sneha Reddy On 6 March 2011 in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu