»   »  కేరళలో అల్లు అర్జున్ ప్రచారం (ఫోటోస్)

కేరళలో అల్లు అర్జున్ ప్రచారం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఇప్పుడీ చిత్రం మళయాళ వెర్షన్ ఏప్రిల్ 24న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే మళయాళ వెర్షన్ కు చెందిన పోస్టర్స్ ,ప్రోమోలుతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఉంది. బిజినెస్ కూడా బాగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడ ఈ సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్ లో అభిమానుల సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

మళాయలంలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఆయన గత చిత్రాలు అక్కడ కూడా విడుదలై మంచి కలెక్షన్లు సాధించాయి. అందుకే తన ప్రతి సినిమా మళయాలంలోనూ తప్పకుండా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు అల్లు అర్జున్. స్లైడ్ షోలో ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.....

అభిమానుల సమక్షంలో

అభిమానుల సమక్షంలో


కేరళలో అభిమానుల సమక్షంలో సన్నాఫ్ సత్యమూర్తి ప్రమోషన్ కార్యమంలో అల్లు అర్జున్.

డిమాండ్ ఎక్కువే

డిమాండ్ ఎక్కువే


ఇక్కడ అల్లు అర్జున్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే. ఆయన గత సినిమాలు ఇక్కడ మంచి కలెక్షన్స్ సాధించాయి.

భారీగా ఫ్యాన్స్

భారీగా ఫ్యాన్స్


ఈ ప్రమోషన్ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

విజయం ఖాయం

విజయం ఖాయం


సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తెలుగు వెర్షన్ మంచి విజయం సాధించిన నేపథ్యంలో మళయాలం వెర్షన్ కూడా బాగా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు

English summary
Check out photos: Allu Arjun in Son Of Satyamurthy Promotions At Kerala.
Please Wait while comments are loading...