twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ ఆర్మీకి థాంక్స్.... రామ్ చరణ్, మహేష్ ప్రస్తావనతో స్పీచ్ అదరగొట్టిన బన్నీ!

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సూపర్ స్పీచ్ ఇచ్చారు.

    Recommended Video

    JC pawan Reddy Revealed Allu Arjun's Political Entry
    ఇండియన్ ఆర్మీకి థాంక్స్

    ఇండియన్ ఆర్మీకి థాంక్స్

    ''ఈ సినిమా పరంగా నేను ముందు థాంక్స్‌ చెప్పాల్సింది ఇండియన్‌ ఆర్మీకి. వారి సపోర్టుకు థాంక్స్. వాళ్లు లేకుంటే సినిమా ఈ స్థాయిలో తీసేవారం కాదు. ఈ కథను నా వద్దకు తీసుకొచ్చింది నల్లమలుపు బుజ్జి గారు, మోరల్ గా ఆయన కోసం నేను ఓ సినిమా చేయాలి. కానీ ఈ సినిమా నాకు ఇవ్వమని అడిగాను. సార్ మీరు ఏమీ అనుకోవద్దు, ఈ సినిమాకు నా పర్సనల్ అబ్లిగేషన్స్ ఉన్నాయి అని అడగ్గానే.. ఇచ్చేశారు. ఆయనకోసం ఫ్యూచర్లో ఏదైనా తప్పకుండా చేస్తాను, ఏం చేస్తాను అనేది మాటల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు.... అని బన్నీ తెలిపారు.

    కొత్త డైరెక్టర్‌ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టారు

    కొత్త డైరెక్టర్‌ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టారు

    ఈ సినిమా నిర్మాతలు లగడపాటి శ్రీధర్ గారు, నాగ బాబు గారు, బన్నీ వ్యాస్ గారికి థాంక్స్. ఈ సినిమా శ్రీధర్‌గారు చేస్తే బావుంటుందని నేనే ఆయన్ను అడిగాను. ఆయన్నే ఎందుకు అడిగానంటే.. ఆయన స్టైల్‌ మూవీ నుండి తెలుసు. డబ్బులు పోయినా కూడా సినిమాల మీద పాషన్‌తో మంచి సినిమాలు చేస్తున్నారు. తపనతో సినిమాలు చేస్తున్న ఆయనకు ఓ మంచి సినిమా చేస్తే బావుటుందని ఆయన్ను అడిగాను. ఆయన ఒప్పుకున్నందుకు థాంక్స్‌. ఒక స్టార్ డైరెక్టర్ కు ఎంత ఖర్చు పెడతారో, ఓ డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి.. రూపాయి కూడా తక్కువ కాకుండా ఖర్చు పెట్టి తీసినందుకు థాంక్స్... అని అల్లు అర్జున్ తెలిపారు.

    నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాగబాబు

    నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాగబాబు

    మనుషుల్లో నాకు చాలా ఇష్టమైన మనిషి నాగబాబుగారు. ఈ సినిమా ఆయనకు చేయడానికి చాలా గర్వ పడుతున్నాను. నాకు నచ్చిన వ్యక్తికి సినిమా చేసే స్థాయికి వచ్చినందుకు అభినులందరికీ కృతజ్ఞతలు తెలపుకుంటున్నాను. నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు థాంక్స్ అని బన్నీ తెలిపారు. తర్వాత థాంక్స్ చెప్పుకోవాల్సింది బన్నీ వాసు.... నేను పెట్టే ఇబ్బందులను భరించి సినిమా చేశారు. నాలుగు గోడల మధ్య ఆయన్ను ఎంత ఇబ్బంది పెడతానో ఆయనకే తెలుసు... అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

    మన తెలుగు లిటరేచర్‌ను మనం ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

    మన తెలుగు లిటరేచర్‌ను మనం ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

    టెక్నీషియన్స్‌లో రైటర్స్‌ కు ముందుగా థాంక్స్ చెప్పుకోవాలి. సీతారామశాస్త్రిగారు, రామజోగయ్యశాస్త్రిగారికి థాంక్స్‌. మన తెలుగు లిటరేచర్‌ను మనం ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిటరేచర్ ప్రమోట్ చేసి మన తెలుగును సినిమాల ద్వారా మన బాషను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.... అని బన్నీ తెలిపారు.

    టెక్నీషియన్స్ గురించి

    టెక్నీషియన్స్ గురించి

    ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌గారు, సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌రవిగారికి థాంక్స్‌. రాజీవ్ రవి గారిలా నేను ఉండాలనే కోరిక ఆయన్ను చూసిన తర్వాత కలిగింది. విశాల్‌ శేఖర్‌గారు సౌత్ ఇండియా కాక పోయినా మేం ఊహించిన దానికంటే మంచి సంగీతాన్ని అందించారు. ఫైట్ మాస్టర్స్, ఇతర టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్.

    కొత్త అర్జున్ గారిని చూస్తారు

    కొత్త అర్జున్ గారిని చూస్తారు

    ఆర్టిస్టుల విషయానికొస్తే... ప్రధానంగా చెప్పాల్సింది అర్జున్‌గారి గురించి.... మేము అనుకున్న పాత్రకు ఆయన వస్తే బావుండు అని బాగా కోరుకున్నాను. ఆయనతో పనిచేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు చూడని అర్జున్ గారిని ఈ సినిమాలో చూస్తారు. శరత్‌కుమార్‌, రావు రమేశ్‌, అనూప్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌ సహా అందరికీ థాంక్స్‌.

    సినిమా హిట్టయితే ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది

    సినిమా హిట్టయితే ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది

    ఒక హానెస్ట్‌ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగాఉండేది. ఆయన కథ చెప్పిన క్షణం, నా కోరిక తీరుతుంది అనిపించింది. నిజంగా ఈ కథ నాకు దొరకడం అదృష్టం. రేపు సినిమా సక్సెస్‌ అయితే వంద కారణాలుంటే.. ఆ వంద కారణాలు డైరెక్టర్ గారే. ఆయన్ను బ్లైండ్‌గా నమ్మి సినిమా చేశాను. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుందని అల్లు అర్జున్ తెలిపారు.

    రంగస్థలం, భరత్ సక్సెస్‌ను మా సినిమా కంటిన్యూ చేయాలి

    రంగస్థలం, భరత్ సక్సెస్‌ను మా సినిమా కంటిన్యూ చేయాలి

    ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన నా తమ్మడు రామ్ చరణ్‌కు స్పెషల్‌ థాంక్స్‌. రంగస్థలంతో హిట్ కొట్టినందుకు మరోసారి అభినందనలు. రంగస్థలం సినిమా వల్ల బయ్యర్స్‌లో ఓ పాజిటివ్‌ మూడ్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే దాన్ని కంటిన్యూగా భరత్‌ అనే నేను సక్సెస్‌ అయ్యింది. మహేష్ బాబుగారికి, కొరటాలగారికి ఈ సందర్భంగా అభినందనలు. అలాగే రేపు రాబోయే నా పేరు సూర్య సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధించాలి, దీని తర్వాత వచ్చే మహానటి, మెహబూబా సినిమాలు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అని బన్నీ తెలిపారు.

    English summary
    Allu Arjun Speech at Naa Peru Surya Na Illu India Pre Release Event. Naa Peru Surya Na Illu India Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X