For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా భార్య అడిగితే చెప్పలేకపోయా.., ఇక్కడికి కచ్చితంగా రావడానికి కారణం ఒక్కటే?-అల్లు అర్జున్

  |

  కేవలం కరెన్సీ లెక్కలు మాత్రమే కాదు.. కంటెంట్‌లో దమ్ముందా? లేదా? అన్న జడ్జ్‌మెంట్ పక్కాగా ఉంటేనే.. ఓ నిర్మాత సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలడు. అలా తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశబ్దాలుగా సక్సెస్‌ను తన ట్యాగ్ లైన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు.

  మరీ అంత ఉన్నత కుటుంబ నేపథ్యం లేకపోయినా.. కేవలం తన ప్యాషన్, పక్కా క్యాలిక్యులేషన్లతో ఇండస్ట్రీలో హిట్స్ కు కేరాఫ్ గా మారాడాయన. ఈ ఏడాది వరుసగా ఆరు హిట్ సినిమాలతో.. తనతో పాటు హీరోల కెరీర్ గ్రాఫ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు.

  ఈ సందర్భంగా అల్లు అర్జున్ పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఒకరకంగా కొంత భావోద్వేగ ప్రసంగం చేశారనే చెప్పాలి. ఆ విశేషాలు మీకోసం ఆయన మాటల్లోనే..

   నా భార్య అడిగితే..:

  నా భార్య అడిగితే..:

  ఎక్కడినుంచి మొదలెట్టాలో తెలియడం లేదు. ఈ ఫంక్షన్‌కి వస్తుంటే.. ఎక్కడికి వెళుతున్నావ్ అని నా భార్య అడిగింది. ఠక్కున ఒక్క సెకనులో జవాబు చెప్పలేకపోయా. సినిమా ఫంక్షన్స్ చాలా ఉంటాయి. కానీ ఇది చాలా స్పెషల్. దారిలో వచ్చేటప్పుడు అనుకున్నా. చాలా యూనిక్ ఈవెంట్ ఇది.

   దిల్ రాజుకే సాధ్యం:

  దిల్ రాజుకే సాధ్యం:

  నాకు తెలిసి ఏ నిర్మాతకైనా ఒక భాషలో, ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు చేసి, ఆరు సినిమాలు సక్సెస్‌ఫుల్ అయి, అందులో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉండటం అనేది అది దిల్ రాజుగారికే చెందింది.ఇంత యూనిక్ సక్సెస్ మీకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను దిల్ రాజుగారు.

  1987లో సూట్ కేసుతో వచ్చా, 5 వేలకు కూడా కష్టపడ్డాం.... దిల్ రాజు ఎమోషనల్ స్పీచ్

   దిల్ రాజుకు కంగ్రాట్స్:

  దిల్ రాజుకు కంగ్రాట్స్:

  మీ బ్యానర్‌లో నా రెండో సినిమాతో(ఆర్య) స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ మైల్‌స్టోన్ ఫిల్మ్ 25వది(డీజే) చేశాను. ఇప్పుడు 27 సినిమాలను కంప్లీట్ చేశారు. ఈ బ్యానర్ ఇంత దూరం సక్సెస్‌ఫుల్‌గా వచ్చినందుకు దిల్‌రాజుగారికి, లక్ష్మణ్, శిరీష్ ‌గారికి కంగ్రాట్స్ తెలుపుతున్నా.

   వాళ్లందరికీ:

  వాళ్లందరికీ:

  ఈ 2017 సంవత్సరంలో హిట్ ఇచ్చిన 6 సినిమాల నటీనటులు, సాంకేతిక నిపుణులకు అందరికీ ధన్యవాదాలు. రాజుగారి బ్యానర్ అభివృద్ధికి ఎంతగానో వారు తోడ్పాటుని అందించారు.

   వస్తానని చెప్పింది.. అందుకు కాదు:

  వస్తానని చెప్పింది.. అందుకు కాదు:

  రాజుగారు నన్ను ఈ ఫంక్షన్‌కి రావాలని చెప్పినప్పడు.. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. అది సక్సెస్ వచ్చినందుకు కాదు. నాకు సక్సెస్ ఇచ్చారని కూడా కాదు.

  ఈ బ్యానర్‌లో ఏ సినిమా మొదలైనా.. శ్రీమతి అనిత సమర్పించు అని ముందు పేర్లు పడతాయి. ఆవిడ అంటే దిల్ రాజుగారికి ఎంతిష్టమో.. అందరికీ తెలుసు. అలాంటిది పెద్ద సక్సెస్ వస్తుందని తెలిసి టైమ్‌కి జీవిత భాగస్వామిని కోల్పోయారు.

   ఆ టైమ్‌లో.. :

  ఆ టైమ్‌లో.. :

  దిల్ రాజు తన జీవిత భాగస్వామిని కోల్పోయిన టైమ్‌లో ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అలాంటి టైమ్‌లో ఈ చిత్రం(డీజే) పెద్ద విజయం ఆయనకి అందించాలని బలంగా కోరుకున్నాను. ఆయనని చాలా కోణాల్లో చూశాను. కానీ ఈ కోణంలో ఆయన్ని చూసి నిజంగా చాలా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్యూ రాజుగారు

  English summary
  Allu Arjun speaks at SVS 2017 success celebration organised by Dil Raju. He said it is a very rare success ever happens to any producer which is made possible by the one and only Dil Raju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X