»   » అమీర్ ఖాన్ ని అనుకరిస్తూ అల్లు అర్జున్ విన్యాసాలు

అమీర్ ఖాన్ ని అనుకరిస్తూ అల్లు అర్జున్ విన్యాసాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రచార వ్యూహంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్ళే అమీర్ ఖాన్ ని అనుకరిస్తూ అల్లు అర్జున్ 'వేదం' చిత్రం ప్రమోషన్ ప్రారంభించారు. రేపు(జూన్ 4న) రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బన్నీ..కేబుల్‌ రాజు పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర స్వరూపస్వభావాల్ని వెల్లడించేలా హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ బస్తీల్లో కేబుల్‌ వైర్లు, టూల్‌ బాక్స్‌ భుజాన వేసుకొని తిరిగాడు‌. అంతే కాదు నిచ్చెన మీంచి స్తంబం ఎక్కి కేబుల్‌ వైర్లు సరి చేసి...అక్కడి ఇళ్లలోని టీవీలో బొమ్మ సరిగా వస్తుందో లేదో చూశారు. ఇక బొమ్మ పడుద్ది అంటూ సరదాగా అక్కడివాళ్లతో మాట్లాడారు. అమీర్‌ 'గజిని', 'త్రీ ఇడియట్స్‌' చిత్రాల కోసం ప్రేక్షకుల చెంతకు వెళ్లి చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ తరహాలో అల్లు అర్జున్‌ కూడా జనాన్ని కలువటం కూడా సినిమా ఓపినింగ్స్ కు ఉపకరిస్తుంది అంటున్నారు. అయితే అమీర్ ఖాన్ దేశంలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసుకుని పబ్లిసిటీ చేసారు. అల్లు అర్జున్ కేవలం ఫిల్మ్ నగర్ లోనే ఈ ప్రమోషన్ చేసారు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన 'వేదం'లో మంచు మనోజ్‌, అనుష్క తదితరులు నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu