»   » అల్లు అర్జున్ 'బద్రీనాథ్' విడుదల జూన్ 3కాదు మరి ఎప్పుడంటే..?

అల్లు అర్జున్ 'బద్రీనాథ్' విడుదల జూన్ 3కాదు మరి ఎప్పుడంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ప్రతిస్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'బద్రీనాథ్'. గతంలో అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను జూన్ 10 వరుకు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి.

విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగానే విడుదలను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మగధీర చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న కమల్ కన్నన్ 'బద్రీనాథ్' కు కంప్యూటర్ గ్రాఫిక్స్ సమకూరుస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా అల్లు అర్జున్ తో జోడి కడుతుంది.

English summary
Stylish Star Allu Arjun is acting as the main lead in the movie Badrinath directed by VV Vinayak and produced by Mega Producer Allu Aravind under the banner Geetha Arts, the movie release date was June 3rd as for the information gathered before but now the release date is said to be postponed to June 10th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu