»   » టెర్రిఫిక్ అందుకే ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ధాంక్స్ చెప్పాడు

టెర్రిఫిక్ అందుకే ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ధాంక్స్ చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' టాక్ కు సంభంధం లేకుండా, బాక్సాఫీసు దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి త‌న శైలిలో ఫైట్లు, డైలాగులు చిత్రీకరించిన విధానానికి తెలుగులో ప్రేక్షకులలో మాస్ ప్రేక్షకులనుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మళయాళం వెర్షన్ ని నిన్న అంటే శుక్రవారం విడుదల చేసారు. అక్కడ కూడా టెర్రిఫిక్ గా ఓపినింగ్స్ వచ్చాయని సమాచారం.


అక్కడ మళయాళి చిత్రాలు కన్నా ఈ సినిమాకే మంచి ఓపినింగ్స్ రావటం జరిగింది. మళయాళి యూత్ మొత్తం సరైనోడు ధియేటర్స్ వద్దే ఉన్నారంటూ కేరళ మీడియా చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో ఆనందంతో అల్లు అర్జున్ తన మళయాళి ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలియచేసారు.అల్లు అర్జున్ కి కేరళలలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన ప్రతీ సినిమాని మళయాలం లోకి డబ్బింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి సరైనోడు తెలుగు వెర్షన్ విడుదల అయిన వారం తరువాత మళయాలం వెర్షన్ విడుదల చేయాలనుకున్నారు..కానీ కుదరలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని, మంచి పబ్లిసిటీ చేసి, 'స‌రైనోడు' మళయాలం వెర్షన్ 'యోధావు' ని విడుదల చేసారు.


తెలుగులో ఇప్పటికే 100 కోట్ల మార్క్ ని దాటిన 'సరైనోడు' మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నది. ఇక ఇప్పుడు కేరళ లో ఎలా ఆడుతుందో చూడాలి.? ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కాథెరీన్ థ్రెసా హీరోయిన్‌ లుగా నటించారు.

English summary
Allu Arjun's 'Sarrainodu' released in Malayalam language yesterday. He tweeted, "I thank all my Malayali fans for the good opening and positive response for #Yodhavu . Heart Full thanks for all the love."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu