»   » బన్నీ, త్రివిక్రమ్ చిత్రం టైటిలేంటి?

బన్నీ, త్రివిక్రమ్ చిత్రం టైటిలేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో డివివి దానయ్య ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ హనీ అని పెట్టినట్లు సమాచారం.ఈ మేరకు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజస్టర్ చేసారు.పవన్ తో చేసిన జల్సా మాదిరిగానే టైటిల్ క్యాచీగా ఉండాలని ఈ టైటిల్ అనుకన్నట్లు చెప్తున్నారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియనాని కన్ఫర్మ్ చేసారు.

ఇక ఫామ్ లో లేని ఇలియానా అల్లు అర్జున్ ప్రక్కన చేస్తే మళ్ళి స్టార్ డమ్ వస్తుందని బావించి తన రేటుని ఒక్కసారిగా కోటి రూపాలయకు తగ్గించుకుంది.మిగతా హీరోలు ఎవరికైనా కోటిన్నరకి పైసా తగ్గనని క్లారిటీగా చెప్తోంది. అది అల్లు అర్జున్ కి ఇలియానా ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్. దానయ్య నిర్మించే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళుతుంది. త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి టూర్ కి వెళ్ళిన అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఇలియానా,హనీ టైటిల్ చూస్తూంటే మళ్ళీ త్రివిక్రమ్ జల్సా చేసేటట్లున్నాడు అంటున్నారు.

English summary
Allu Arjun and writer-director Trivikram Srinivas are teaming up for a film. The latest buzz is that the film has been titled ‘Honey’.Producer DVV Danayya has registered this title ‘Honey’ on his banner recently at Film Chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu