»   » 12 కోట్లు ఇస్తామన్నా అల్లు అర్జున్ వద్దన్నాడు

12 కోట్లు ఇస్తామన్నా అల్లు అర్జున్ వద్దన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ ...12 కోట్లు ఆఫర్ ని వదిలేసుకున్నాడా అనే వార్త ఇప్పుడు మీడియా వర్గాల్లో వినపడుతోంది. అదీ కేవలం ఓ పది రోజులు పాటు యుఎస్ లోని ఐదు సిటీల్లో టూర్ . దాన్ని వదిలేసుకోవటం ఏమిటీ అంటే..సినిమాలకే అల్లు అర్జున్ ప్రధాన్యత ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ ఈ టూర్ ఏంటి... పోగ్రాం ఏంటీ అంటే క్రింద మ్యాటర్ చదవాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డ్యాన్స్‌లు చేయడంలో నెంబర్ వన్ గా నిలిచి తోటి హీరోలకు పోటీని ఇచ్చే అల్లు అర్జున్ ని రీసెంట్ గా ముంబయ్‌కి చెందిన ఒక ఏజెన్సీ వాళ్ళు సంప్రదించారు. అమెరికాలోని అయిదు నగరాల్లో డ్యాన్స్ షోలలో పాల్గొంటే, ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఇస్తామన్నారు. కానీ అలాంటి వాటిపై ఆసక్తి లేదని అల్లు అర్జున్ .. ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు.

లైవ్ డ్యాన్స్ షోలలో పాల్గొనడం అల్లు అర్జున్‌కు అంతగా ఇష్టం లేనిదని చెప్తున్నారు. నిర్వాహకులు ఎంత ఇస్తామన్నా అందుకు ఆయన వ్యతిరేకమని చెప్తున్నారు. అందుకే, ఈ 12 కోట్ల ఆఫర్‌ను ఆయన కాదన్నట్లు బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అల్లు అర్జున్ కి సన్నిహితుడు అయిన నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.... "అవును... అల్లు అర్జున్ ని యుస్ లో స్టేజ్ ఫెరఫార్మె న్స్ చేయటానికి, డాన్స్ చేయటం కోసం సంప్రదించారు. అయితే బన్ని ఈ విధమైన వాటికి వ్యతిరేకం...అందుకే వద్దునుకున్నారు " అని చెప్పారు.

కానీ, విచిత్రం ఏమిటంటే - ఇంత పారితోషికం ఇస్తుంటే, ఒప్పుకోక ఏం చేస్తారనుకున్నారో ఏమో ఈ డ్యాన్స్ షోలకు అల్లు అర్జున్ ఒప్పేసుకున్నారని సదరు నిర్వాహకులు ప్రచారం చేసేసుకున్నారట!

Allu Arjun turns down 12 cr offer

ఇక బన్నీ... బాలీవుడ్ చిత్రం గురించి ....

అల్లు అర్జున్ నటిస్తోన్న హిందీ చిత్రం 'ఏబీసీడీ-2' గతంలో వచ్చిన 'ఏబీసీడీ'కి సీక్వెల్... ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వంలో ఇంతకు ముందు రూపొందిన 'ఎనీబడీ కెన్ డాన్స్' చిత్రం. ఈ చిత్రంలో ప్రభుదేవా కూడా ఓ ముఖ్యభూమిక పోషించాడు. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఏబీసీడీ-2'లో అల్లు అర్జున్ కూడా కనిపించనున్నాడు

కథానుగుణంగా సౌత్ ఇండియాలో బెస్ట్ డాన్సర్ గా ఎన్నికయ్యే పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడట. 'ఏబీసీడీ-2'లో కేవలం ఓ పాటలో డాన్స్ చేయడమే కాదు, అందులో కీలకమైన పాత్రలోనూ అల్లు అర్జున్ కనిపించనున్నాడట.ఈ చిత్రంలో ప్రభుదేవా విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇందులో అల్లు అర్జున్ సౌతిండియా బెస్ట్ డాన్సర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. కేవలం ఒక్క పాటకే పరిమితం కాకుండా, సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇచ్చినట్టే. సినిమాను జూన్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Allu Arjun has been approached by a Mumbai-based agency to put on his dancing shoes for a five-city tour across the US for Rs 12 crore. But he promptly declined the offer. “Yes. Allu Arjun has been approached for a dance tour in the US but he is against giving stage performances irrespective of what the organisers offer him,” confirms producer Bunny Vaas, the actors’ confidant, when contacted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu