»   » వెయిట్ చేస్తున్నా...ఆగలేకపోతున్నా : అల్లు అర్జున్

వెయిట్ చేస్తున్నా...ఆగలేకపోతున్నా : అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఆయన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అని ఉంది. ఆగలేకపోతున్నా... అనే అర్దం వచ్చేలా అల్లు అర్జున్ తాజాగా ట్వీట్ చేస్తూ బ్రూస్ లీ చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయనేం ట్వీట్ చేసారంటే...


అలాగే...రెండు రోజుల క్రితం...


రామ్‌చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ' విడుదల తేదీని ముందే నిర్ణయించారని... దానికి ఆ చిత్ర నిర్మాతపై ఆరోపణలు చేయడం సరికాదని సినీ హీరో అల్లుఅర్జున్‌ అన్నారు. ఈనెల 9న విడుదలైన 'రుద్రమదేవి'కి 16న విడుదలయ్యే 'బ్రూస్‌లీ' పోటీ అవుతుందని, కావున ఈ చిత్రం విడుదలను ఒక వారం వాయిదా వేయాలని ఇటీవల కొందరు సినీ ప్రముఖులు బహిరంగంగా డిమాండ్‌ చేశారు.


Allu Arjun tweet about Chiranjeevi in Brucelee

దీనికి అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిస్తూ 'బ్రూస్‌లీ విడుదల తేదీని ముందుగానే ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 4న విడుదల కావాల్సిన 'రుద్రమదేవి' కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ కాలేదు. 'బ్రూస్‌లీ' విడుదల తేది విషయం తెలిసే నిర్మాతలు 'రుద్రమదేవి'ని ముందుగా రిలీజ్‌ చేశారు. దీనికి 'బ్రూస్‌లీ' నిర్మాతని నిందించడం సరికాదు. రెండూ చిత్రాలు సమానంగా ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్‌ చేశారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే ఆయన...తన తాజా చిత్రం రుద్రమదేవి నుంచి కొన్ని ఫొటోలను తీసుకుని ట్వీట్ చేసారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.

English summary
Allu Arjun tweeted: I wish the Entire Cast n Crew of #BruceLeeTheFighter ALL THE BESTTT ! Can't wait to see Chiranjeevi Garu on Screen after many years !"
Please Wait while comments are loading...