»   »  స్టేజిపై అల్లు అర్జున్ 'రొమాన్స్' అదుర్స్ (ఫోటోలు)

స్టేజిపై అల్లు అర్జున్ 'రొమాన్స్' అదుర్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈరోజుల్లో' టీమ్‌ రూపొందిస్తున్న తాజా సినిమా 'రొమాన్స్‌'. 'ఎవ్వెరిబడి నీడ్స్‌' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్‌ హీరో. డింపుల్‌, మానస హీరోయిన్స్. 'డార్లింగ్‌' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్‌ సినిమా గ్రూప్‌-మారుతి మీడియా హౌస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జి.శ్రీనివాసరావు-ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. నిన్న అల్లు అర్జున్ చేతుల మీదుగా..ఆడియోని హైదరాబాద్ శిల్ప కళా వేదికలో రిలీజ్‌ చేశారు.

తొలిపాటను బెల్లంకొండ సురేష్,రెండో పాటను బి.జయ, మూడో పాటను వీరభద్ర చౌదరి,నాలుగోపాటను రవికుమార్ చౌదరి, విడుదల చేసారు. థియోట్రికల్ ట్రైల ర్ ని జె.బి ఆవిష్కరించారు. తొలి సీడిని అల్లు అర్జున్ విడుదల చేసారు. రిచా తొలిసీడిని అందుకుంది.

రొమాన్స్ యాప్ ని రిచా గంగోపాధ్యాయ, పవన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాబా సెహగల్, రక్షిత, జె.ప్రభాకర రెడ్డి, స్వప్నిక,బార్గవి, కరుణాకరన్, కామ్న జట్మలాని, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ఆ విశేషాలు...స్లైడ్ షోలో...

చిన్న సినిమా అయినా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ఈ పంక్షన్ కి రావటంతో ఫ్యాన్స్ తో ఆడిటోరియం కిటకిటలాడింది.

ఆవిష్కరణకు ముందు కామ్నా జట్మలాని డాన్స్ లు అందరినీ అలరించాయి.

అల్లు అర్జున్ కి, మారుతి కు ఉన్న స్నేహం ఈ పంక్షన్ లో చర్చనీయాంసంగా మారింది.

దర్శకుడు వీరభద్ర చౌదరి,రిచా గంగోపాధ్యాయ ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగి..అందరి దృష్టిలో పడ్డారు.

బి.జయ మాట్లాడుతూ..మారుతి వటవృక్షం..డార్లింగ్ స్వామి ఇప్పుడు రొమాన్స్ స్వామి అయ్యారు అన్నారు.

వీరభద్ర చౌదరి మాట్లాడుతూ.. దర్శకుడు స్వామి నాకు మంచి ప్రెండ్...టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది..సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.

హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ..నాకు రొమాన్స్ అంటే అర్దం తెలియదు..దర్శకుడు దగ్గరుండి అన్నీ చెప్పి చేయించుకున్నారు అని చెప్పారు.

సురేష్ కొండేటి,బాబా సెహగల్ కలిసి ఇలా పంక్షన్ లో కనిపించారు.

హీరో ప్రిన్స్..తన ప్రక్కన బాబా సెహగల్ ని పెట్టుకుని ఇలా లుక్స్ ఇచ్చారు

మారుతి గురించే పంక్షన్ లో అందరూ మాట్లాడటం జరిగింది.

హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ఈ సినిమా తమకు సక్సెస్ ఇచ్చి నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

ప్రిన్స్ తనకు అవకాసమిచ్చిన మారుతికి ప్రత్యేక ధాంక్స్ చెప్పారు.

బన్నీ మాట్లాడుతూ.. ఎవరికైనా లైఫ్ లో రొమాన్స్ ఉంటుంది. నా లైఫ్ లోనూ ఉంది..ఇది చిన్న సినిమా కాదు..మంచి సినిమా అనిపించుకుంటుంది అని అన్నారు.

అలాగే దర్శకుడు స్వామి..హ్యాపీ సినిమా అప్పటినుంచీ పరిచయం..మారుతి నా ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మారుతి సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తాను అని బన్ని అన్నారు.

నిర్మాత మారుతి మాట్లాడుతూ...నాకు దర్శకుడు స్వామి గారు గురువు వంటి వారు. ప్రతీ కథ ఆయనతో డిస్కస్ చేస్తాను..సినిమా చాలా బాగా వచ్చింది. మరో హిట్ కొట్టబోతున్నాం అన్నారు.

English summary

 Allu Arjun praised director Maruthi for his dedication and hard work. "You can provide support to anyone but only people with talent shine in this competitive film industry. Maruthi has talent, hard working nature and he is very dedicated. That is why he is making successful movies," Allu Arjun heaped praise on Maruthi at the audio launch of Romance. The film starring Prince and Dimple has backing up of Maruthi and is being produced by Good Cinema Group's SKN and Srinivasa Rao. The film is being directed by dialogue writer turned director ‘Darling’ Swamy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu