»   » 300 ప్రింట్లతో దూసుకువస్తున్న 'వరుడు'

300 ప్రింట్లతో దూసుకువస్తున్న 'వరుడు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన 'వరుడు' చిత్రం ఈ నెల 31 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 300కు పైగా ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. వీటిలో 65 వరకూ డిజిటల్ ప్ర్రింట్లు ఉంటాయి. అల్లు అర్జున్ సరసన ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా కనిపించనున్నారు. అలాగే భానుమెహ్రా అనే మోడల్ ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతోందని, ఆమె హీరోయిన్ అని వినపడుతోంది. ఆమె స్టిల్స్, వార్తలు మీడియానుంచి గుణశేఖర్ దాస్తూ వస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఓ ఐటం సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. నిజజీవితంలోని 100 కుటుంబాలను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిచేత నటింపచేసారు. సుహాసిని హీరో అల్లు అర్జున్ తల్లిగా చేస్తోంది. నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా గెస్ట్ లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేటూరి పాటలు, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu