»   » అల్లు అర్జున్ లేటెస్ట్ 'వేదం' ఆడియో రిలీజ్ డేట్

అల్లు అర్జున్ లేటెస్ట్ 'వేదం' ఆడియో రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గమ్యం ఫేమ్ క్రిష్ లేటెస్ట్ చిత్రం 'వేదం' ఆడియో మే రెండున రిలీజవుతోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. మల్టిఫుల్ స్టోరీస్ తో మల్టి డైమన్షన్స్ తో ఈ చిత్రం స్క్రిప్టు తయారైంది. వేదం చిత్రం మే ఇరవైన రిలీజ్ అవుతోంది. ఆర్ ఎఫ్ సిలో షూటింగ్ జరిగే సాంగ్ లోని సెట్ మీదే ఈ ఆడియో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. ప్రస్తుతం రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. మే 2న పాటలు విడుదలవుతాయి.

నిర్మాతలు మాట్లాడుతూ "కథ, కథనాలు కీలకం. వైవిధ్యంగా సాగుతాయి. కీరవాణి సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం ఆకట్టుకుంటాయ"ని అన్నారు. క్రిష్‌ చిత్రం గురించి చెబుతూ "కేబుల్‌ రాజుగా అల్లు అర్జున్‌, విజయ్‌ చక్రవర్తిగా మనోజ్‌, అమలాపురం సరోజగా అనుష్క నటిస్తున్నారు. విభిన్న కోణాల్లో సాగే స్క్రీన్‌ప్లే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంద"ని పేర్కొన్నారు. మనోజ్‌బాజ్‌పాయి, శియాగౌతమ్‌, దీక్షాసేత్‌, లేఖ వాషింగ్టన్‌, శరణ్య, బ్రహ్మానందం, పోసాని, రఘుబాబు నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu