»   » కడప - అమీన్ పీర్ దర్గాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!?

కడప - అమీన్ పీర్ దర్గాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వరుడు" సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీరామనవమి నాడు హైద్రాబాద్ లోని ఫిలింనగర్ లో సీతారాములవారికి పట్టువస్త్రాల్ని సమర్సించిన అల్లు అర్జున్, తన సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ కడప జిల్లాలో పేరొందిన అమీన్ పీర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్గాను సందర్శించాడు.

బడే దర్గాలో పూజలు నిర్వహించారు. సంగీత మాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహ్మాన్ రెగ్యులర్ గా అమీన్ పీర్ దర్గాని సందర్శస్తుంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'మగధీర" సినిమా టైమ్లో ఛరణ్ కూడా అమీన్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ మాటకొస్తే అమీన్ ఫీర్ దర్గాని వీలైనప్పుడల్లా దర్శించడం చిరంజీవి ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి.

సినీ రంగానికి సంబందించిన వారంతా దర్గాకు వస్తున్నారు. అయితే తాను ఎప్పుడూ ఇక్కడకు రాలేదన్నారు. తన తండ్రి అల్లు అరవింద్, రామ్ చరణ్ ల సూచన మేరకే ఇక్కడకు వచ్చానన్నారు. దర్గాను సందర్శించడం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చిందన్న బన్నీ త్వరలో విడుదలవుతున్న 'వరుడు" సినిమా విజయవంత కావాలని కోరుకున్నానని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu