For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఏంట్రా? క్లాప్ పీకిన అల్లు అర్జున్!

  |
  Allu Arjun Warning Speech At Padi Padi Leche Manasu Pre Release Event | Filmibeat Telugu

  శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చితరం 'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బేనర్లో చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్శమించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. సినిమా అంశాలతో పాటు ఇతర విషయాలపై మాట్లాడారు.

  పెళ్లయిపోయింది పిల్లల తండ్రి అయిపోయాను అనుకున్నారా?

  పెళ్లయిపోయింది పిల్లల తండ్రి అయిపోయాను అనుకున్నారా?

  నాకు చాలా చాలా నచ్చిన ట్రైలర్ ‘పడి పడి లేచె మనసు'. నాకు బేసిగ్గా లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. (ఫ్యాన్స్ అరవడంతో) ఏంటి అరుస్తున్నారు... పెళ్లయిపోయిందనా? ఇంద్ర సినిమా డైలాగ్ స్టైల్ లో చెప్పాలంటే ‘పెళ్లయిపోయింది పిల్లల తండ్రి అయిపోయాను అనుకున్నారా? అదే యూత్ అదే ఎనర్జీ.... అంటూ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  టెక్నీషియన్లు అంటే రెస్పెక్ట్

  టెక్నీషియన్లు అంటే రెస్పెక్ట్

  సినిమా విషయానికొస్తే... ట్రైలర్ చూడగానే ఒక మ్యాజిక్ కనిపించింది. తొలి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా చేస్తున్న నిర్మాత సుధాకర్ గారికి శుభాకాంక్షలు. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల్లోనే కాదు నిర్మాతల్లో కూడా ట్రెండ్ మారాలి. కొత్త సినిమాలు రావాలి. నాకు టెక్నీషియన్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఈ సినిమాకు పని చేసిన వారంతా వారి బెస్ట్ ఇచ్చారని అనుకుంటున్నాను.

  సాయి పల్లవితో సాంగ్ చేయడానికి వెయిట్ చేస్తాను

  సాయి పల్లవితో సాంగ్ చేయడానికి వెయిట్ చేస్తాను

  ఈ సినిమాలో సాయి పల్లవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మలయాళం ప్రేమం, ఫిదా, ఎంసీఏ చూసినపుడు ఎక్స్ ట్రార్డినరీ అనిపించింది. నేను ఆమెతో సినిమా చేస్తే సీన్ కాకుండా సాంగ్ చేయడానికి వెయిట్ చేస్తాను. ఫిదాలో ‘వచ్చిందే సాంగ్' నేను చూసినన్ని సార్లు సాయి పల్లవి కూడా చూడలేదు. నా ఫేవరెట్ హీరోయిన్లలో ఆమె ఒకరు. నా ఫేవరెట్ డాన్సర్.

  నాతో కూడా లవ్ స్టోరీ చేయ్యి బ్రదర్

  నాతో కూడా లవ్ స్టోరీ చేయ్యి బ్రదర్

  హను రాఘవపూడి అందాల రాక్షసి చూశాను. అందులో లవ్ స్టోరీ బాగా నచ్చింది. కృష్ణగారి వీర ప్రేమగాధ, లై సినిమాలు చూసినపుడు కూడా లవ్ స్టోరీ బాగా అనిపించింది. నేను కూడా ఆయనతో లవ్ స్టోరీ చేయాలనుకున్నాను కానీ తన తెలివితేటలు ఉపయోగించి శర్వా ఆ ఛాన్స్ కొట్టేశాడు. మను రాఘవపూడి ఈ సినిమాతో హిట్టు కొడతాడని భావిస్తున్నాను.. నాతో కూడా లవ్ స్టోరీ చేయాలని కోరుకుంటున్నాను... అని అల్లు అర్జున్ వ్యాఖ్యనించారు.

   శర్వాను అందుకే గారూ అని గౌరవిస్తున్నాను

  శర్వాను అందుకే గారూ అని గౌరవిస్తున్నాను

  నేను శర్వాను గారు అని ఎందుకు అంటున్నానంటే... ఆయన నా కంటే చిన్నవాడైనా, నా ఫ్రెండ్ అయినప్పటికీ మీరంతా ఆయనకు ఒక స్టేచర్ ఇచ్చి ఇపుడు ఈ స్థాయిలో నిలబెట్టారు. దాన్ని గౌరవిస్తూ నేను శర్వాగారు అంటున్నాను.

  కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఏంటి?

  కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఏంటి?

  సొసైటీలో సినిమా యాక్టర్లు, పొలిటీషియన్లు, ఒక మంచి స్థానంలో ఉన్న ఎవరినైనా గౌరవించాలి. కొందరు చీఫ్ మినిస్టర్లను కూడా కేసీఆర్, చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నారు. ఏంటిది? విమర్శించవచ్చు... తప్పులేదు కానీ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని గౌరవించాలి. బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి.

  చిరంజీవి ఏంట్రా..? పవన్ కళ్యాణ్ ఏంట్రా..?

  చిరంజీవి ఏంట్రా..? పవన్ కళ్యాణ్ ఏంట్రా..?

  నేను మొన్న టీవీ చూస్తున్నపుడు... ఒకడు ఏయ్ చిరంజీవిని పిలువు అంటున్నాడు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవి గారూ అని పిలవాలి. పవన్ కళ్యాణ్ గారూ అని పిలవాలి. పొలిటీషియన్ అయినంత మాత్రాన రెస్పెక్ట్ ఇవ్వకూడదని మీకు ఎవరూ హక్కు ఇవ్వలేదు. సొసైటీలో ఎవరికైనా, వారు మనకు ఇష్టం లేకున్నా గౌరవం ఇవ్వాలి.... అని బన్నీ వ్యాఖ్యానించారు.

  రెండు సినిమాలు ఆడాలి

  రెండు సినిమాలు ఆడాలి

  ఫస్ట్‌ సినిమా నుండి నేను శర్వాను గమనిస్తున్నాను. తను ప్రతి సినిమాకు పెరుగుతున్నాడు. జనం నుండి సంపాదించుకున్న సెల్ఫ్‌ మేడ్‌ హీరో తను. అలాంటి హీరో పక్కన నేను నిలబడటం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో పాటు ఈ 21న నా సొంత తమ్ముడు వరుణ్‌తేజ్‌ సినిమా 'అంతరిక్షం' విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు బాగా ఆడాలి అని అల్లు అర్జున్ అన్నారు.

  English summary
  Allu Arjun Warning speech at PPLM pre release Event. Padi Padi Leche Manasu Movie Pre Release Event held at Shilpakala Vedika, Hyderabad.Allu Arjun, Sharwanand, Sai Pallavi, Kalpika Ganesh, Hanu Raghavapudi, Vishal Chandrasekhar, Priyadarshi, Sudhakar Cherukuri, Prasad Chukkapalli, Sudheer Varma, Krishnakanth, Anil Sunkara, Ajay, Shatru, MLA Gottipati Ravi Kumar, Suma at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X