»   » చంద్రబాబుకు... చిరంజీవి కూతురు శ్రీజ వెడ్డింగ్ ఇన్విటేషన్!

చంద్రబాబుకు... చిరంజీవి కూతురు శ్రీజ వెడ్డింగ్ ఇన్విటేషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కలిసి శ్రీజ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందజేసారు. శ్రీజ పెళ్లికి తప్పనిసరిగా హాజరు కావాలని చంద్రబాబును అరవింద్ కోరారు. బెంగళూరులోని చిరంజీవి ఫాంహౌస్ లో శ్రీజ వివాహం ఈ నెల 28న జరగనున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ నెల 31న హైదరాబాదులో వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

చిరంజీవి కూతురు శ్రీజ బ్యాచిలర్ పార్టీ... (ఫోటోస్)
మొత్తం ఐదురోజుల పాటు పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పెళ్లి కూతురును చేసే కార్యక్రమంతో పెళ్లి వేడక మొదలైంది. దీంతో పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ ఇలా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీజ పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాల బాధ్యలు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకంగా హోస్ట్ చేస్తున్నారు.

 Allu Arvind invites Chandrababu Naidu For Srija Marriage

పెళ్లి కూతురును చేసే కార్యక్రమం అల్లువారి ఇంట్లో జరిగింది. బ్యాచిలర్ పార్టీని రామ్ చరణ్ భార్య ఉపాసన హోస్ట్ చేసింది. పెళ్లి వేడుక బెంగుళూరులో జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్ శుక్రవారం బెంగుళూరు వెళ్లారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్, మోహందీ ఫంక్షన్, సంగీత పంక్షన్ ఇలా వరుసగా జరుగబోతున్నాయి. శ్రీజ పెల్లి వేడుకకు బెంగుళూరులోని మెగాఫ్యామిలీకి చెందిన ఫాంహౌస్ వేదిక కాబోతోంది.'

శ్రీజ బ్రైడ్ మేకింగ్: బన్నీ-స్నేహ దంపతులే హోస్ట్ చేసారు (ఫోటోస్)

అయితే ఈ పెళ్లి వేడుకను పవన్ కళ్యాణ్ మిస్సవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యూరఫ్ లో జరుగుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చివరి షెడ్యూల్ లో బిజీగా గడుపుతున్నారు. ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన అలుపు లేకుండా శ్రమిస్తున్నారు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే మార్చి 31న జరిగే శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ కు పవన్ కళ్యాణ్ అందే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Allu Aravind met Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. He has gone to Chandrababu Naidu's farmhouse to extend an invitation to him to the wedding of Chiranjeevi's younger daughter Srija. He handed over an invitation and requested him to attend the wedding ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu