»   » గ్రాండ్ గా అల్లు అర్జున్ కొడుకు పుట్టిన రోజు(ఫొటో)

గ్రాండ్ గా అల్లు అర్జున్ కొడుకు పుట్టిన రోజు(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ కు తన ముద్దుల కొడుకు అల్లు ఆర్యన్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనకున్నారు. ఈ స్పెషల్ అకేషన్ కోసం ఆయన సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఆర్యన్ పుట్టిన రోజు ఇదిగో ఈ ఫొటోలో చూపినట్లు జరిపారు. అల్లు ఆర్యన్ ది ఇది ఒకటో పుట్టిన రోజు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే...


రీసెంట్ గా... సన్నాఫ్ సత్యమూర్తిగా కనిపించిన అల్లు అర్జున్ ....త్వరలో గోన గన్నారెడ్డి గా కనిపించి అలరించనున్నారు. మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నాడు.


Allu Ayaan's 1st Birthday in Grand Style!

గుణ శేఖర్ మాట్లాడుతూ... ''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం కథానాయకులలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.


ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇందుకోసం బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది.'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

English summary
Bunny planned his son's maiden birthday in Singapore. "Spent my son Ayaan's 1st birthday in Singapore !," claims a roud Father.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu