»   »  సంపూర్ణేష్ బాబు సీన్స్ అందుకే తీసేసాం: అల్లు శిరీష్

సంపూర్ణేష్ బాబు సీన్స్ అందుకే తీసేసాం: అల్లు శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Sirish clarify about Sampoornesh Babu
హైదరాబాద్: అల్లు శిరీష్ తాజా చిత్రం కొత్త జంట నుంచి సంపూర్ణేష్ బాబుని తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది. ఓ రకంగా సినిమాకు ఇది పబ్లిసిటి కూడా ఇచ్చింది. ఈ విషయం నిజమే అంటున్నారు అల్లు శిరీష్. కొత్త జంట చిత్రం రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై క్లారిఫికేషన్ ఇచ్చారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ... నా సినిమాలో నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కథాచర్చల సమయంలోనే నాన్న చర్చిస్తారు అంతే. సంపూర్ణేష్‌బాబు సన్నివేశాలను మేం కావాలని తొలగించలేదు. కథ నడతకు అడ్డు వస్తున్నాయనే తీసేశాం. అలాగే ఈ సినిమా విషయంలో ఏ రీ షూట్స్ జరగలేదు అన్నారు.

చిత్రం గురించి చెప్తూ... మారుతి గత సినిమాల్లో ప్రధాన పాత్రలకు కుటుంబ నేపథ్యం ఉండేదిగానీ ప్రధానంగా హీరో,హీరోయిన్స్ కనిపించేవారు. కానీ 'కొత్తజంట'లో హీరో,హీరోయిన్స్ పాత్రలతోపాటు వారి తల్లిదండ్రుల పాత్రలు కూడా కీలకం. ఈ సినిమా ముగింపులో వచ్చే సందేశం అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది అంటున్నారు.

కథ గురించి చెప్తూ... తన కోసం, తన ఎదుగుదల కోసం చూసుకునే వ్యక్తి హీరో. అలాంటివాడికి అదే ఆలోచనా విధానం ఉన్న అమ్మాయి ఎదురైతే.. వాళ్లిద్దరూ ప్రేమలో పడితే... ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. ఒకే ఆఫీస్‌లో పని చేసేవాళ్లు ప్రేమించుకుంటే వచ్చే ఇబ్బందులు కూడా చూపించాం. ఐదేళ్ల కిత్రం మారుతి ఇంకా దర్శకుడిగా మారక ముందే నాకు ఈ సినిమా కథ చెప్పాడు. బాగా నచ్చింది. అప్పుడు కొన్ని మార్పులు కూడా చెప్పాను. ఆఖరికి ఆ కథ నా దగ్గరకే వచ్చింది అన్నారు.

English summary

 Allu Sirish said .. "At the editing table, Makers felt Sampoornesh Babu's scenes were unnecessary and have no connection what-so-ever with the story. With the collective decision of everyone, We chopped off those scenes," he clarifies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu