»   » అల్లు శిరీష్ వివాదం...ఆధారాలు లభ్యం

అల్లు శిరీష్ వివాదం...ఆధారాలు లభ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ముగిసిపోయిందనుకున్న అల్లు శిరీష్ వివాదం ...మళ్లీ మొదటికి వచ్చింది. రాష్ట్ర రాజధానిలోని 'ఓవర్‌ ది మూన్‌' పబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన అల్లరికి సంబంధించిన ఫోటోలను బాధితురాలు పోలీసులకు అందజేశారు.

ఆ సమయంలో తామెవరు పబ్‌లో లేమని అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు ఇప్పటికే బహిరంగ ప్రకటన చేసినప్పటికీ.. ఆ ఫోటోల్లో హీరో అల్లు అర్జున్‌ సోదరుడు వెంకట్‌ కనిపిస్తున్నారు.

తనపై ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఢిల్లీకి చెందిన మహిళా ఫొటోగ్రాఫర్‌ (34) శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. పబ్‌లో తనతోపాటు ఉన్న డీజే కెమెరా చిప్‌లోని ఫొటోలను ఆమె పోలీసులకు అందించారు.

ఇదిలా ఉంటే ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు, డీజే ఢిల్లీకి వెళ్లిపోయారని తెలిసింది. ఘటనకు సంబంధించి ఫొటోలు వెలుగు చూడటంతో.. సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయమై వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఓ అధికారిని మీడియా వారు వివరణ కోరగా బాధితులు ఫొటోలు అందించిన మాట వాస్తవమేనన్నారు. ఇంత జరుగుతున్నా మహిళా ఫొటోగ్రాఫర్‌ పట్ల జరిగిన సంఘటనపై పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించకపోవడాన్ని బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
According to media reports, a TV Delhi girl complained to Jubilee Hills Police Allu Sirish had misbehaved with her on Saturday night. She told police that Allu Sirish has misbehaved with her in a bar at midnight. Although the girl is said to have complained that Allu Sirish specifically, Jubilee Hills police are not confirming and saying the child complained of unidentified persons and the brother of a hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu