twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ తేజ్ కి కౌంటర్ వేసి అల్లు శిరీష్...!?

    By Sindhu
    |

    తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన తరఫున రామ్ చరణ్ పెద్దరికాన్ని తీసుకుని పలు ఫంక్షన్లకు హాజరవుతున్నాడు. పైగా, షూటింగులు కూడా ఇంకా ఏమీ స్టార్ట్ కాకపోవడంతో ఈ ఖాళీ సమయాన్నిలా వినియోగించుకుంటున్నాడు. మొన్నామధ్య ముంబైలో జరిగిన అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ పెళ్లి రిసెప్షన్ కి అటెండ్ అయిన చరణ్, తాజాగా మయాన్మార్ (బర్మా) వెళ్లాడు. బ్రిటిష్ వాళ్ల పాలనలో మన తెలుగు వాళ్లు ఎంతో మంది పనుల కోసం అప్పటి బర్మాలోని రంగూన్ వెళ్లి, అక్కడే స్థిరపడిపోయారు. వాళ్లంతా యాంగాన్ నగరంలో 'బర్మా తెలుగు అసోసియేషన్' గా ఓ సంఘం కూడా పెట్టుకున్నారు. ఆ సంస్థ శత వార్షికోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వీటికి చీఫ్ గెస్ట్ గా చరణ్ హాజరయ్యాడు.

    అభిమాన హీరో తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో వాళ్లంతా కేరింతలు కొడుతూ రిసీవ్ చేసుకున్నారు. 'బర్మాలో నాలుగు లక్షల మంది తెలుగు వాళ్లు వున్నారంటే నమ్మలేకపోతున్నాను. వారు నాపై చూపించిన ప్రేమపూర్వక ఆదరణకి ముగ్దుడినయ్యాను. ఆ అందమైన ప్రదేశం, రుచికరమైన వాళ్ల వంటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి' అంటున్నాడు చరణ్. ఈ మాటలు విన్న అల్లు శిరీష్ 'నాలుగు లక్షల మందా? అంటే, ముంబై, పూనే, అహ్మదాబాద్ లలో వున్న తెలుగు వాళ్ల కంటే ఎక్కువన్న మాట. అయితే, మన నెక్స్ట్ మార్కెట్ బర్మానే!' అంటూ వ్యాపార దృష్టితో కామెంట్ చేసాడు.

    English summary
    Went fr the100th BURMA telugu association celebrations in yagoon. lovely people,food and place.i cant believe 4lakh telugu people live there..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X