»   » అంతా అల్లు అర్జున్ భజనే చేసారు

అంతా అల్లు అర్జున్ భజనే చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ భజనతో ఆ వేదిక మొత్తం హోరెత్తిపోయింది. అందరూ బన్నీ నామస్మరణలో పోటీలు పడి మరీ ఉపన్యాసాలు దంచేసారు. ఇంతకీ ఏ వేదిక అంటారా..అది అల్లు శిరీష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'కొత్తజంట' ఆడియో పంక్షన్. హైదరాబాద్‌లో విడుదలైన 'కొత్తజంట' ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టేజిపై ఉన్న అల్లు అర్జున్ గురించే చెప్పటం అందరూ మాట్లాడారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ... "మా నాన్న గీతా ఆర్ట్స్‌లో నన్ను హీరోగా పెట్టి సినిమా చేయడం ఆనందంగా ఉంది. గురువు, బెస్ట్‌ఫ్రెండ్, అన్నయ్య అన్నీ నాకు బన్నీ. మారుతి రాత్రికి రాత్రే విజయవంతమైన దర్శకుడిగా మారలేదు. అతని స్థానం వెనక పదేళ్ల శ్రమ ఉంది. ఇలా పైకొచ్చిన దర్శకుడితో సినిమా చేస్తున్నాను అంటే గర్వపడుతున్నాను. మారుతి నుంచి రాబోతున్న వైవిధ్యమైన చిత్రమిది'' అని అన్నారు.

Allu Sirish's 'Kotha Janta' music launched

"నా శ్వాస, ప్రాణం బన్నీ. అందుకే పేరు ముందు బన్నీ పేరు పెట్టుకున్నాను. నేను ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అల్లు అర్జున్‌. అతని ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరాను. 'బన్ని' సినిమా సమయంలో వినాయక్‌గారితో నేను గడిపిన క్షణాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. చిత్రబృందం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను'' అని నిర్మాత బన్నీవాసు చెప్పారు.

మారుతి మాట్లాడుతూ "బన్ని నాకు ప్రాణ స్నేహితుడు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం వాసు.గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన 'జానీ' సినిమాకి లోగో తయారు చేయడం నా తొలి అనుభవం. ఇప్పుడు మళ్లీ 'కొత్తజంట'తో ఈ బ్యానర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. బన్ని వాసు దగ్గరుండి సినిమా బాగా వచ్చేలా చూసుకున్నారు. కెమెరామేన్ రిచర్డ్ అద్భుతంగా తెరుకెక్కించారు. శిరీష్, రెజీనా 'కొత్తజంట' అనే పదానికి సరిపోయారు. జె.బి. మంచి సంగీతాన్నిచ్చారు'' అని చెప్పారు.


అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమాను మారుతి దర్శకత్వంలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఆడియో సీడీలను కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. వి.వి.వినాయక్ అందుకున్నారు.

మంచి పాటలు కుదిరాయని అల్లు అరవింద్, జె.బి., రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల చెప్పారు. సినిమా పెద్ద విజయం సాధించాలని బి.వి.యస్.యన్.ప్రసాద్, ఎన్వీ ప్రసాద్, జెమిని కిరణ్, కె.ఎల్.నారాయణ, నల్లమలుపు బుజ్జి, డా.కె.వెంకటేశ్వరరావు, దిల్‌రాజు, సుకుమార్, సురేందర్‌రెడ్డి, గోపీచంద్ మలినేని, చంటి అడ్డాల, ఠాగూర్ మధు, రెజీనా, మధురిమ ఆకాంక్షించారు.

English summary

 Kotha Janta starring Allu Sirish and Regina in the lead roles had its music launched. Several celebrities including Allu Arjun graced the event that was held at Rock Heights in Hyderabad. Veteran director K Raghavendra Rao unveiled the audio albums.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu