»   » అల్లు శిరీష్ మూవీ ప్రారంభించిన బోయపాటి, శ్రీను వైట్ల, మారుతి (ఫోటోస్)

అల్లు శిరీష్ మూవీ ప్రారంభించిన బోయపాటి, శ్రీను వైట్ల, మారుతి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు శిరీష్ హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. గురువారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మారుతి హాజరయ్యారు.

శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటిశ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సినిమా గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ 'డైరెక్టర్ ఎం.వి.ఎన్. రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో 'బన్ని' సినిమాను నిర్మించారు. నాకు డైరెక్టర్ తో చిన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు' అన్నారు.

ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్ పరిశీలిస్తున్నారు. డైలాగ్ వెర్షన్ వర్క్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 20-30 కథలు వింటుంటాను. కానీ ఈ కథను సింగిల్ సిటింగ్ లోనే ఓకే చేసేశాను. నాన్నగారు కూడా కథను సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశారు. లవ్ ఎంటర్ టైనర్, 700 సంవత్సరాల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స ఉండే చిత్రం అని శిరీష్ చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

బోయపాటి క్లాప్

బోయపాటి క్లాప్


ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి క్లాప్ కొట్టారు.

కామెడీ, పెర్ఫార్మెన్స్

కామెడీ, పెర్ఫార్మెన్స్


ఈ చిత్రంలో కామెడీ, పెర్ఫార్మెన్స్ రెండు కలగలిపిన రోల్ చేసారు. ఇలాంటి రోల్ చేయాలని ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను అని శిరీష్ తెలిపారు.

శ్రీను వైట్ల

శ్రీను వైట్ల


శ్రీను వైట్ల కెమెరా స్విచాన్ చేయగా, మారుతి గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ

దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ


మంచి లవ్ ఎంటర్ టైనర్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో శిరీష్ కు థాంక్స్'' అన్నారు.

ఈ చిత్రానికి

ఈ చిత్రానికి


ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: జిబ్రాన్, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: ఎం.వి.ఎన్.రెడ్డి.

English summary
Allu Sirish - Sri Shailendra productions production No. 2 film launched today at Annapoorna studios.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu