»   » ఫ్లాష్..ఫ్లాష్ :అల్లు శిరీష్ కొత్త సినిమా మొదలయ్యింది

ఫ్లాష్..ఫ్లాష్ :అల్లు శిరీష్ కొత్త సినిమా మొదలయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : మెగా కుటుంబం నుంచి మరో హీరో అల్లు శిరీష్. అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ కు తొలి చిత్రం సమయంలో మంచి క్రేజే వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాఫ్ అవటం అతన్ని ఇబ్బంది పెట్టింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Allu Sirish’s next launched in style

‘గౌరవం' సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కొత్త జంట' తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, తాజాగా ఈరోజే మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు.

Allu Sirish’s next launched in style

‘యువత', ‘ఆంజనేయులు', ‘సోలో' సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సారొచ్చారు' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే కావటం విశేషం. రామ్ తో అనుకున్నా వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు అల్లు శిరీష్ తో ముందుకు వెళ్తున్నారు.

Allu Sirish’s next launched in style

ఈ ఉదయం అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శిరీష్ ఈ సందర్భంగా తెలిపారు.

English summary
After a decent debut with ‘Gouravam’, Allu Sirish is now back with his latest flick in the direction of Parasuram. This youthful entertainer was launched today with a formal pooja in Hyderabad.
Please Wait while comments are loading...