»   » నీ ఫిజిక్ బాగుందని అనేసిన అల్లు శిరీష్, ఆ అమ్మాయి ఏమంటుందో

నీ ఫిజిక్ బాగుందని అనేసిన అల్లు శిరీష్, ఆ అమ్మాయి ఏమంటుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఇంకేం ఇష్టం నాలో అని ఆ అమ్మాయి అడిగితే... నీ ఫిజిక్ బావుందని చెప్పేశాడు ఈ అల్లు శిరీష్. ఆ మాట విన్నాక ఏ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగింది...ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ అనే విషయం తెలియాలంటే శ్రీరస్తు శుభమస్తు సినిమా కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో.. 'జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదని' హీరో చెబుతున్నారు.

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. లైఫ్ లో ఎవ్వరినీ ఎక్కువగా ప్రేమించకూడదు. ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్... మన క్యారెక్టర్ ని తెలీకుండా మనమే చంపేసుకొంటుంటాం అంటూ హీరో చెప్పే డైలాగ్ కు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. డైలాగులతో గతంలో లాగానే ఈ సారి కూడా పరుశరామ్ ఆకట్టుకోబోతున్నాడని స్పష్టంగా అర్దం అవుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ... ఉమ్మడి కుటుంబం వుండాలి. అంతా కలసి తీసుకునే నిర్ణయాలు నిలబడతాయనే నమ్మే వ్యక్తి శిరీష్‌ది. అదే మా సినిమా. ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. పెళ్ళి తరువాత అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎంత బాధ్యతగా వుండాలో పక్కన ఫ్యామిలి వుంటేనే తెలుస్తుంది.

Allu Sirish's Srirastu Subhamastu Teaser

కూతుర్ని అత్తారింటికి పంపించిన తండ్రి ఆవేదన.. పెళ్ళైన కొడుకు భాద్యతగా వుంటున్నాడో లేదో అనుకునే తల్లి ఆలోచన ఇలా ఓ మంచి ఫ్యామిలిలో అన్ని ఎమెషన్స్‌ కలిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోషన్స్‌ని కలిపి ఇందులో చూపించాం.

హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటాయి. శిరీష్‌ పాత్రలో ప్రతి ఓక్క కుర్రాడు తనని తాను చూసుకుంటాడు. అంత అందమైన పాత్రలో శిరీష్‌ అంతకు మించి నటించాడు.

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, రావురమేష్‌, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్‌, రణధీర్‌, హంసానందిని, సుమిత్ర మిగిలిన పాత్రలు పోసించారు. మరోవైపు పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

హీరో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. మంచి చిత్రాలు చేస్తున్నావని అంటుంటే మనసులో చాలా ఆనందంగా వుంటుంది. కమర్షియల్‌ ఫార్ములాని మిక్స్‌ చేసి ఓ మంచి ఫ్యామిలి కథని దర్శకుడు బుజ్జి నాకు చెప్పారు. సినిమా వినొదమే కాదు ఆలోచించేవిధంగా వుండాలని నమ్ముతాను. అలాంటి కథే ఇది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో జరుగుతుంది. దీంతో చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్‌ వివరిస్తూ .. చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌ 'సరైనోడు' చిత్రం తరువాత మా బ్యానర్‌లో వస్తున్న చిత్రమిది. దర్శకుడు బుజ్జి చాలా మంచి చిత్రాన్ని తీసాడు. ఇప్పటికే పాజిటివ్‌ టాక్‌తో వున్న ఈ చిత్రంలో నటీనటులందరూ చాలా బాగా నటించారు. థమన్‌ అందించిన ఆడియో సినిమాకి ప్లస్‌ అవుతుంది. అతి త్వరలో ఆడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నామని అన్నారు.

థమన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొన్నారు.

English summary
Watch Srirastu Subhamastu Telugu Movie Teaser Starring Allu Sirish , Lavanya Tripathi, prakash Raj Directed by Parasuram ( Bujji ), Produced by Allu Aravind ,Music by SS Thaman From the Production House of Geethaarts
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu