»   » ఐఫా అవార్డులకు హోస్ట్‌గా మెగా ఫ్యామిలీ హీరో

ఐఫా అవార్డులకు హోస్ట్‌గా మెగా ఫ్యామిలీ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ కి సంబంధించిన పెద్ద అవార్డు ఫంక్షన్లలో ఒకైటన ఐఫా(ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ఫిల్మ్ అకాడ‌మీ) సౌత్ సినిమా ఇండస్ట్రీపై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల మార్కెట్ భారీగా పెరగడం, దేశంలో జరిగే సినిమా వ్యాపారంలో సగ భాగం సౌత్ సినిమాలదే కావడంతో ఐఫా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై సౌత్ సినిమాలకు సంబంధించిన కూడా ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ ఫ‌స్ట్ టైం ఐఫా వారు సౌత్ ఇండియ‌న్ సినిమాని కూడా ద్రుష్టిలో పెట్టుకుని సౌత్ ఇండియ‌న్ ఐఫా అవార్డ్స్ వేడుక‌ని నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కి క‌మ‌ల్ హాస‌న్, నాగార్జున‌, వెంక‌టేష్, త‌మ‌న్నా, రానా ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

Allu Sirish to Host IIFA awards

ఫ‌స్ట్ సౌత్ ఐఫా వేడుక‌కి ‘ఐఫా ఉత్స‌వ‌మ్' అని పేరు పెట్టారు. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ ఉత్స‌వంను హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఫా ఉత్స‌వ‌మ్ లో తెలుగు కేట‌గిరికీ అల్లు శిరీష్ హాస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

నాలుగు భాషా చిత్రాలకు గాను ఐఫా అవార్డులు ప్రకటించనుంది. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిఔలి స్టేడియంలో ఐఫా ఉత్సవం కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, అల్లు అరవింద్, తమన్నా, నమ్రతతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయిన సంగతి తెలిసిందే.

English summary
For the upcoming IIFA awards for South film industries, Allu Sirish has decided to take on the Telugu segment of the awards.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu