Just In
- 44 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు శిరీష్ వివాదం..అసలేం జరిగింది?
పోలీసులు, విశ్వసనీయవర్గాల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన తేజల్ పరాన్ షా అనే ఫోటోగ్రాఫర్ బ్రిటన్‌కు చెందిన మహిళా డీజే ఫైజా బబుల్‌తో కలిసి జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్‌లోని 'ఓవర్ ది మూన్' పబ్‌లో డీజేకు వచ్చారు. శనివారం రాత్రి ఫైజా సంగీతంతో హోరెత్తిస్తుండగా తేజల్ ఫొటోలు తీసుకుంటున్నారు.
అల్లు అరవింద్ కుమారులైన హీరో అర్జున్, అతడి సోదరులు వెంకట్, శిరీష్‌లు కుటుంబసభ్యులతో కలిసి అదే పబ్‌కు వచ్చారు. హోరెత్తుతున్న సంగీతానికి కుర్రకారు హుషారుగా వూగుతున్నారు. తేజల్ పదే పదే ఫోటోలు తీస్తుండటంతో అల్లు శిరీష్ ఆమెను హెచ్చరించినట్టు తెలిసింది. ఈ సందర్భంలో ముగ్గురు యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అర్జున్, శిరీష్‌లు పబ్ నుంచి వెళ్లిపోయారు.
అసభ్యకరంగా ప్రవర్తించినవారు ఫలానావారని అక్కడున్న కొందరు తేజల్‌కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడానికి సిద్ధపడ్డారు. అప్పటికి అక్కడే ఉన్న అల్లు వెంకట్ ఆమెను వారించినట్టు తెలిసింది. అయినా తేజల్ వినలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.
అందులో ఆమె ఎవరి పేర్లనూ ప్రస్తావించకపోవడంతో గుర్తుతెలియని యువకులపై సెక్షన్ 354, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ డి.వి.ప్రదీప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనలో అల్లు శిరీష్ ఉన్నాడని, ఇద్దరు స్నేహితులతో సహా అతడు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ టీవీల్లో హోరెత్తడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.
ఈ అంశాన్ని శిరీష్, పోలీసులు వేర్వేరుగా ఖండించారు. తాను అంతక్రితమే అక్కడి నుంచి వెళ్లిపోయానని శిరీష్ ప్రకటించగా.. విచారణ చేయకుండానే పేర్లు ఎలా చెబుతామంటూ పోలీసు అధికారులు అంటున్నారు.