Don't Miss!
- Finance
అంచనాలకు అందని బంగారం రేట్లు: రోజుకో ధర..కొనాలంటే కష్టమేగా
- Sports
Asia Cup : భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కావాలా నాయనా.. ఇవిగో డిటైల్స్
- News
అందరి దృష్టీ ప్రధాని మోడీ ప్రసంగం మీదే: వరాలు..కొత్త పథకాలు?
- Lifestyle
Relationship Mistakes: గాఢమైన బంధంలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు. జాగ్రత్త..!
- Technology
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 'ఓలా ఎలక్ట్రిక్ కారు'.. ఇలా ఉంటుంది
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
అల్లు స్నేహారెడ్డి ఐడియాకు అంతా ఫిదా.. ఆ ఫోటోలన్నీ ఒకే చోట.. బన్నీ ఫ్యాన్స్ హల్చల్
అల్లు ఫ్యామిలీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అల్లు పిల్లల అల్లరి, బన్నీ పర్సనల్ సీక్రెట్స్ గురించి అల్లు స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రతీ రోజూ ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మామూలుగా అయితే బన్నీది ఒక ఐకానిక్ ఫోటో ఉంటుంది. స్కూటీ మీద ఫ్యామిలీ ఉంటే.. స్కూటీ వెనకాల ఎగురుతూ బన్నీ గాల్లో తేలిపోతాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
హాట్ పూనమ్ రాజ్ పుత్.. సోషల్ మీడియాకు సెన్సార్ వచ్చేలా ఉంది

అల్లు స్నేహా అలా..
అల్లు అర్హ, అయాన్‌లు చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బన్నీ సతీమణి షేర్ చేస్తూ ఉంటుంది. అలా స్నేహారెడ్డి షేర్ చేసే ఫోటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలానే ప్రత్యేక సందర్భాలు, పండుగలు, ఈవెంట్లు, బర్త్ డే పార్టీ సమయాల్లో అల్లు ఫ్యామిలీ ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది.

మాల్దీవుల్లో రచ్చ..
మొన్నీ మధ్య అయాన్ బర్త్ డే సందర్బంగా అందరూ కూడా మాల్దీవుల్లో రచ్చ చేశారు. ఎప్పుడూ చూడని విధంగా అల్లు ఫ్యామిలీ కనిపించి అందరికీ షాకిచ్చింది. అల్లు స్నేహారెడ్డి సైతం తన స్టైల్‌ను మార్చి మాల్దీవులక తగ్గట్టుగా డ్రెస్సులు ధరించింది. అల్లు స్నేహా ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

తాజాగా అలా..
తాజాగా అల్లు స్నేహారెడ్డి ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో నాలుగు ఫోటోలున్నాయి. అన్నీంటిని ఒకే ఫ్రేమ్‌లో బంధించి తమ తీపి గుర్తులన్నింటిని ఒకే చోటకు చేర్చింది. ఆ ఫోటోలను చూసి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఇందులో బన్నీ స్నేహా ప్రేమ పెళ్లి దగ్గరి నుంచి నేటి వరకు ఉన్న స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా ఉన్నాయి.

ఆ ఫోటలన్నీ కూడా..
బన్నీ స్నేహా మొదటి ఫోటో, అయాన్ పుట్టాక దిగిన ఫోటో, ఆ తరువాత అర్హ అయాన్‌లతో దిగిన ఫోటో, ఇప్పుడు లేటెస్ట్‌గా ఫ్యామిలీ అంతా దిగిన ఫోటోలను ఒకే చోటకు చేర్చింది. ఇందులో విశేషం ఏంటంటే.. అదే స్కూటీ, అదే స్టైల్, అదే లొకేషన్ అంతా ఒక్కటే. కానీ తమ కుటుంబం మాత్రం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలను అభిమానులు చేసి మురిసిపోతోన్నారు.