For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లుడు అదుర్స్ ట్విట్టర్ రివ్యూ: ఆ సినిమాలను గుర్తు చేసిన బెల్లంకొండ.. ఎలా ఉందంటే!

  |

  'అల్లుడు శ్రీను' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతడు.. సరైన హిట్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. మొదటి సినిమాతో పాటు 'స్పీడున్నోడు', 'కవచం', 'సీత', 'సాక్ష్యం' వంటివి అతడికి నిరాశనే మిగల్చగా.. 'జయ జానకీ నాయక' మాత్రం మంచి టాక్ అందుకుంది. ఇక, 'రాక్షసుడు'తో భారీ హిట్‌ను అందుకున్న సాయి శ్రీనివాస్.. తాజాగా 'అల్లుడు అదుర్స్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ మీకోసం!

  వాళ్లందరితో కలిసి వచ్చిన బెల్లంకొండ హీరో

  వాళ్లందరితో కలిసి వచ్చిన బెల్లంకొండ హీరో

  ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ - యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. రియల్ హీరో సోనూ సూద్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవీ శ్రీ సంగీతం అందించాడు.

  సినిమాపై కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా

  సినిమాపై కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా

  వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, సినిమాపై ఉన్న నమ్మకంతో ఒకరోజు ముందుగానే అంటే జనవరి 14నే దీన్ని విడుదల చేశారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే రూపొందినప్పటికీ.. ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. దీంతో మార్కెట్ కూడా బాగానే జరిగింది.

  తక్కవ థియేటర్లే... అల్లుడు సందడి షురూ

  తక్కవ థియేటర్లే... అల్లుడు సందడి షురూ

  సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు సినిమాలకు విశేషమైన స్పందన ఉంటుంది. అయితే, ఈ సారి మన చిత్రాలను కాదని.. తమిళ పరిశ్రమకు చెందిన ‘మాస్టర్'కు ఎక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బెల్లంకొండ సినిమా చాలా తక్కువ ప్రాంతాల్లోనే విడుదల అవుతోంది. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు కలకళలాడుతూ ‘అల్లుడు అదుర్స్' సందడి కనిపిస్తోంది.

  ఫస్టాఫ్ అలా.. సెకాండాఫ్ ఇలా... నిండుగా

  ఫస్టాఫ్ అలా.. సెకాండాఫ్ ఇలా... నిండుగా

  ఇప్పటికే ఓవర్సీస్‌లో ‘అల్లుడు అదుర్స్' ప్రీమియర్ షోలు ప్రదర్శితమవగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో షోలు పడ్డాయి. సినిమాను చూసిన ప్రేక్షకుల తీర్పు ప్రకారం.. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో సాగుతుందని.. ఈ సీన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. అలాగే, సెకాండాఫ్ మాత్రం కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో సెంటిమెంటల్‌గా ఉంటుందని చెబుతున్నారు.

  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... ఓవరాల్ టాక్ ఇదే

  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... ఓవరాల్ టాక్ ఇదే

  ‘అల్లుడు అదుర్స్' సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పుకోవచ్చు. బలమైన ఎమోషన్ సీన్స్‌ను పండించడంలో హీరో సక్సెస్ అయ్యాడని, గత సినిమాలతో పోలిస్తే ఇందులో మరింత మెచ్యూర్డ్‌గా నటించాడని అంటున్నారు. ఇక, మిగిలిన వారు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారని చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ మొత్తం చూసే ఎంటర్‌టైనర్ అని అభిప్రాయపడుతున్నారు.

  Apsara Rani & Other Celebs About RaviTeja In Krack Event | Filmibeat Telugu
  ఆ సినిమాలను గుర్తు చేసిన సాయి శ్రీనివాస్

  ఆ సినిమాలను గుర్తు చేసిన సాయి శ్రీనివాస్

  ‘అల్లుడు అదుర్స్' చూసిన వారందరూ రొటీన్ స్టోరీ అని అంటున్నారు. గతంలో ఇదే కథతో చాలా సినిమాలే వచ్చినప్పటికీ.. ఇందులో కామెడీని జోడించడంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. దర్శకుడు కథనంపై మరింత శ్రద్ధ చూపాల్సిందని చెబుతున్నారు. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, నిర్మాణ విలువలు, కెమెరామెన్ వర్క్ అంతా పర్వాలేదన్న టాక్ వినిపిస్తోంది.

  English summary
  Alludu Adhurs is an upcoming 2021 Indian Telugu-language romantic drama comedy film written and directed by Santosh Srinivas and produced by Gorrela Subrahmanyam with Bellamkonda Sreenivas, Nabha Natesh, Anu Emmanuel, Sonu Sood and Prakash Raj playing lead roles in the film. The film will be released on 15 January 2021 coinciding with Sankranthi. Devi Sri Prasad is composing the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X