»   »  సమంత, తమన్నా మసాలా సీన్లు....పెద్దలకు మాత్రమే!

సమంత, తమన్నా మసాలా సీన్లు....పెద్దలకు మాత్రమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టెనర్ 'అల్లుడు శ్రీను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రాన్ని పెద్దలకు మాత్రమే అని సర్టిఫైడ్ చేసారు. 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమాలో హీరోయిన్ సమంత, తమన్నాలపై మసాలా సీన్లు, యాక్షన్ సన్నివేశాలు మొతాదుకు మించి ఉండటంతో పెద్దలకు మాత్రమే పరిమితం అని సర్టిఫైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోది.

బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్


ఈ చిత్రం ద్వారా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. కొడుకు తొలి సినిమా కావడంతో ఈచిత్రం కోసం భారీగా ఖర్చు పెట్టారు.

విడుదల తేదీ

విడుదల తేదీ


ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నామని బెల్లంకొండ సురేష్ తెలిపారు.

తారాగణం

తారాగణం


బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రదీప్, రఘుబాబు, వేణు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, రవి బాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, స్టంట్ శివ, రవి వర్మ, వెంకట్, డాన్స్: రాజసుందరం, ప్రేమ్ రక్షిత్, గణేష్, శేఖర్, కథ: కె.యస్.రవీంద్రనాథ్(బాబీ), కోన వెంకట్, డైలాగ్స్: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు, కో డైరెక్టర్స్: పుల్లారావు, సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వివి వినాయక్.

English summary

 
 Bellamkonda Sai Srinivas debut movie ‘Alludu Seenu’ directed by V V Vinyak has been cleared by Censor Board awarding ‘A’ Certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu