»   » ఇది కామెడీ సీనూ.... ('అల్లుడుశీను' ప్రివ్యూ)

ఇది కామెడీ సీనూ.... ('అల్లుడుశీను' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్స్ వారసుడు కాకపోతే కొత్తగా పరిచయమయ్యే హీరోల సినిమాలకు రిలీజ్ కు ముందు అసలు క్రేజ్ ఉండదు. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఈ విషయం గమనించినట్లున్నారు సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్. అందుకే రిలీజ్ కు ముందే క్రేజ్ కోసం వినాయిక్ ని దర్శకుడుగా ఎంచుకోవటం,సమంతను హీరోయిన్ గా పెట్టుకోవటం, తమన్నాను ఐటం సాంగ్ కు ఒప్పించటం, భారీ నిర్మాణ విలువలు వంటివి తన కొడకు లాంచింగ్ చిత్రానికి పెట్టుకున్నాడు.

సాధారణంగా హీరో డ్యూయిల్ రోల్ చేస్తూంటారు. అయితే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేసారు. హీరో అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) మామ నరసింహా గానూ, హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేసే భాయ్ గానూ కనిపిస్తాడు. తన మామ లాంటివారే ఇంకెకరు ఉన్నారని గమనించిన అల్లుడు శ్రీను...దాన్ని ఎలా వాడుకోవాలని చూసాడు. అక్కడ నుంచి వచ్చే పరిణామాలు ఏమిటి అనేది కామెడీ చెప్పిన కథ ఇది.

Alludu Seenu telugu Movie preview

వినాయక్‌ సినిమా అంటే.. మాస్‌.. క్లాస్‌ కలిపి తీస్తాడు. ఫైట్లకు ఫైట్లు.. పాటలకు పాటలు, నవ్వులకు నవ్వులు ఇది సామాన్యుడి మాట. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అల్లుడుశీను' సినిమాను తెరకెక్కించటం..అందులో కామెడీ కూడా బాగా ఉంది అనే టాక్ తీసుకోవటం వరకూ జరిగింది. దాంతో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కొత్త కుర్రాడైనా ఈజ్ తో బాగా చేసాడని టాక్ కూడా ఉంది. అవన్నీ ప్లస్ లుగా మారి...సినిమా ప్రేక్షకుడుకి పడితే లాంచింగ్ చిత్రంగా ఇది పెద్ద హిట్ అవుతుంది.


నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు
మాటలు:కోన వెంకట్,
రచన:గోపిమోహన్,
కథ:కె.ఎస్.రవీంద్రనాధ్,
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్,
పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల,
ఎడిటింగ్:గౌతమ్‌రాజు,
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
కెమెరా:ఛోటా కె.నాయుడు,
సమర్పణ:బెల్లకొండ సురేష్,
నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.


English summary
Alludu Seenu starring renowned producer Bellamkonda Suresh's son Bellamkonda Sreenivas and Samantha, directed by VV Vinayak. This film which also features Prakash Raj, Brahmanandam (as Dimple) and others in crucial roles is touted to be an out and out family entertainer studded with all essential commercial elements
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu