»   » సాఫ్ట్‌వేర్ భర్తకు హీరోయిన్ విడాకులు: దర్శకుడితో రెండో పెళ్లి!

సాఫ్ట్‌వేర్ భర్తకు హీరోయిన్ విడాకులు: దర్శకుడితో రెండో పెళ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: మళయాలం హీరోయిన్ జోతిర్మయి రెండో వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా మళయాల దర్శకుడు అమల్ నీరద్‌తో సన్నిహితంగా ఉంటున్న ఆమె అతన్ని వివాహమాడటం ద్వారా తన తదుపరి జీవితాన్ని అతనితో గడపబోతోంది. దర్శకుడు అమల్ నివాసంలో ఈ వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. క్లోజ్ ఫ్రెండ్ష్ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Amal Neerad And Jyothirmayi Enters Wedlock

అమల్ నీరద్, జోతిర్మయి వివాహ వార్త అటు సినీ రంగాన్ని, ఇటు అభిమాన లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లి జరిగే వరకు వీరిద్దరు తమ సంబంధాన్ని గోప్యంగా మెయింటేన్ చేయడం గమనార్హం. మీడియా వారు కూడా తమ మధ్య ఇంత కాలం సాగిన ప్రేమ బంధాన్ని కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డారు.

వారి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.....అమల్ నీరద్ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర్ అలియాస్ జాకీ రీ లోడెడ్' సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ చిత్రంలో జోతిర్మయి ఐటం సాంగ్ చేసింది. పెళ్లి తర్వాత అమల్ నీరద్ తమ పెళ్లి ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసాడు.

Amal Neerad And Jyothirmayi Enters Wedlock

జోతిర్మయి మొదటి వివాహం తన చిన్ననాటి స్నేహితుడు, ఐటి ప్రొఫెషనల్ అయిన నిశాంత్ తో జరిగింది. అయితే ఇద్దరి మధ్య పొసగక పోవడం, కాపురంలో విబేధాల కారణంగా 7 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2011లో విడాకులు తీసుకున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న జోత్మిర్మయి 2013 నుండి లైమ్ లైట్లో ఉండటం లేదు. ఆమె చివరగా నటించిన మళయాల చిత్రం ‘హౌస్ ఫుల్'.

English summary
Amal Neerad and Jyothirmayi, the popular director and actress entered wedlock. The couple tied the knot in a simple ceremony conducted at Amal's residence, in the presence of family members and close friends.
Please Wait while comments are loading...