twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ తో నా ప్రేమ అలా మొదలైంది: అమల

    By Srikanya
    |

    హైదరాబాద్ :నాగార్జున, అమల ఇద్దరిదీ లవ్ మ్యారేజే అనే సంగతి తెలిసిందే. ఈ విషయమే ఆమె మాట్లాడుతూ.... తెలుగులో 'కిరాయి దాదా' విడుదలయ్యాక నాగార్జునతో కలిసి ఐదు సినిమాల్లో నటించా. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ విషయం అమ్మకు చెప్పాను. దాంతో వెంటనే తనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే మొదట్నుంచీ నేను సరైన నిర్ణయాలే తీసుకుంటానని తన నమ్మకం. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతల కోసం సినిమాలకు దూరం అవ్వాలన్న నా ఆలోచననీ అమ్మ శభాష్‌ అని మెచ్చుకుంది అంటూ చెప్పుకొచ్చింది.

    తొలి సినిమా అవకాసం గురించి చెప్తూ....ఇంటర్‌కి వచ్చాక కాలేజీలో నృత్య ప్రదర్శనలిచ్చా. ఒకసారి నా కార్యక్రమం చూసిన దర్శకుడు టి.రాజేందర్‌ గారు నటించమని అడిగారు. చెబితే నమ్మరు కానీ, అప్పటి వరకూ నేనొక్క సినిమా కూడా చూళ్లేదు. రాజేందర్‌గారు మరీ మరీ అడగడంతో కాదనలేకపోయా. అమ్మని అడిగితే 'అవకాశం వదులుకోవద్దు' అని చెప్పింది. 1986లో తమిళంలో మొదటి సినిమా విడుదలైంది. అదే ఏడాది ఏడు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అమ్మ కోరిక ప్రకారం చదువుకు ఆటంకం కలగకుండా ఒకవైపు నటిస్తూనే, బీఏ పూర్తి చేశా. నటిగా మంచి పేరు తెచ్చుకున్నాక అమ్మే నాకోసం వచ్చింది. ఓ సినిమా చూపించా. భాష తెలియదు కాబట్టి తెర మీద నన్ను మాత్రమే చూసిందట. ఎంతో మురిపెంగా చెప్పింది అంటూ వివరించింది.

    తల్లి గురించి చెప్తూ.... మా అమ్మ పేరు మెయిటిమ్‌ కనోలీ. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికీ అంటుంటాను 'నాకంటే నువ్వే అందంగా ఉన్నావమ్మా' అని. తను పుట్టి పెరిగిందంతా ఐర్లాండ్‌లోనే. అమ్మతో సహా మా బంధువులంతా బాగా చదువుకున్నవారు. అమ్మ మానసిక శాస్త్రం, సామాజిక సేవ, జంతు సంరక్షణలో శిక్షణ తీసుకుంది. నాన్నది పశ్చిమబెంగాల్‌లోని కనౌజ్‌. తను నేవీలో ఉన్నతాధికారి. నాన్న ఉద్యోగ రీత్యా తరచూ బదిలీలు ఉండేవి. దాంతో నా చదువుకు ఇబ్బంది కలుగుతుందని అమ్మ బాధపడేది. తను చదువుకెంతో ప్రాధాన్యాన్ని ఇస్తుంది. తన చదువు వృథా కాకూడదని ఉద్యోగం చేసేది. డబ్బు కోసం కాదు అన్నారు.

    తను చేసే పనులు నలుగురికీ ఉపయోగపడాలన్న ఆరాటం. అందుకే స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగం చేసేది. నాకు గుర్తుండి అమ్మ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి స్వచ్ఛంద సంస్థలూ, సామాజిక కార్యకర్తల గురించి తెలుసుకొనేది. తనలో కష్టపడి చేసేతత్వం, స్వతంత్ర భావాలూ నాకు బాగా నచ్చుతాయి. వారసత్వంగా ఆ గుణాలనే నేనందుకున్నా. 'మన జీవితం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఎవరి కోసం రాజీ పడకూడదు. నిర్ణయాలు తీసుకొనే ప్పుడు పరిణతితో ఆలోచించాలి' అని తరచూ చెప్పేది అంటూ చెప్పుకొచ్చింది.

    English summary
    Amala is married to Telugu Film actor Akkineni Nagarjuna since 1992 and the couple have a son, Akhil. She is the step-mother of actor Naga Chaitanya Akkineni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X