twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైజ్‌జీరో ఫిగర్ లేదు.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నా.. ప్రైవసీకి భంగం.. అమల ఘాటుగా లేఖ

    By Rajababu
    |

    Recommended Video

    Amala Akkineni Questions Media’s Relentless Scrutiny

    సెలబ్రీటీల వ్యక్తిగత జీవితంలోకి మీడియా ప్రవేశించడంపై గత కొద్దికాలంగా పలు రకాలు వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతున్నది. శ్రీదేవి మరణం నేపథ్యంలో బయటకు వచ్చిన సున్నితమైన అంశాలను ఛానెల్లు, వెబ్‌సైట్లు, ఇతర మీడియా బాగానే వినియోగించుకొన్నాయి. శ్రీదేవి ఘటనపై మీడియా వ్యవహరించిన తీరును కొందరు బాహాటంగానే నిరసన తెలిపారు. తాజాగా మీడియా వైఖరిని సీనియర్ నటి, అక్కినేని నాగార్జున సతీమణి అమల అక్కినేని తీవ్రంగా దుయ్యబట్టారు. నా జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించనివ్వండి అని అమల ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

    హోదాకు తగినట్టు జీవిస్తా

    హోదాకు తగినట్టు జీవిస్తా

    నా వయసుకు తగిన హోదాను అనుభవించనివ్వండి. అలిసిపోయిన నా లుక్‌ను, పెరిగిన నా శరీర బరువుపై కామెంట్ చేయకుండా నా జీవితాన్ని సగర్వంగా సాగనివ్వండి. నా కళ్లద్దాల చాటు నుంచి కనిపించే కళ్ల కింద గీతలు నా వయసు గురించి ప్రతీరోజు గుర్తు చేస్తాయి అని అమల చెప్పారు.

    సైజ్ జీరో ఫిగర్‌ లేదు

    సైజ్ జీరో ఫిగర్‌ లేదు

    నా ఆత్మగౌరవం దెబ్బ తినకుండా దస్తులు ధరించకుండా ఆపగలరా? నాకు సైజ్‌జీరో ఫిగర్‌ లేదు. నేను సీజన్ బట్టి దుస్తులు వేసుకొనే ఆసక్తి లేదు అని తన పోస్టులో అమల పేర్కొన్నారు.

    19 ఏళ్ల వయసులో

    19 ఏళ్ల వయసులో

    నా వయసుకూ, మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను. నా జట్టుకు కలర్ వేసుకోవడాన్ని మీరు ఆపగలరా? 19 ఏళ్ల వయసులో పుష్ఫక్‌లో ధరించిన షార్ట్స్‌ను ధరించకుండా ఆపగలరా అని అమల తీవ్రంగా స్పందించారు.

    మంచి విషయాలపై చర్చ

    మంచి విషయాలపై చర్చ

    నేను ఎలా వంట చేస్తాను అనే మంచి విషయాలపై ఎందుకు చర్చించరు. నా వయసుకు, దేహానికి సరిపడే దుస్తులను వేసుకొంటాను. ఎవరేమీ కామెంట్స్ చేసినా నాపై ప్రభావమే చూపవు అని అమల తన పోస్టులో పేర్కొన్నారు.

     శాంతియుతంగా నా పని..

    శాంతియుతంగా నా పని..

    ప్రతీరోజును శాంతియుతంగా నా పనులను చేసుకోనివ్వండి. చెత్త విషయాలు నాపై ప్రభావం చూపకుండా ఈవెంట్లకు హాజరుకానివ్వండి. నా జీవితంలో నాకో లక్ష్యం ఉంది. దానిని పూర్తి చేయనివ్వండి అని మీడియాను ఆమె కోరారు.

     రేటింగ్ కోసం కథనాలు వద్దు

    రేటింగ్ కోసం కథనాలు వద్దు

    బాక్సాఫీస్ సంచలనాల కోసమో, టీఆర్సీ రేటింగ్ కోసమో, పేజ్‌3 శీర్షికల కోసమో సెన్సేషనల్ కథనాలు రాయొద్దు. సోషల్ మీడియా లైక్స్, కామెంట్ల నుంచి నాకు విమోచనం కలిగించండి అని మీడియాకు అమల సూచించింది.

    ప్రైవసీకి భంగం కలిగించొద్దు

    స్వేచ్ఛగా బతుకున్న నన్ను ఓ ట్రైమ్ ఫ్రేమ్‌లో బంధించే ప్రయత్నం చేయకండి. నా జీవితాన్ని పరిపూర్ణంగా బతుకనివ్వండి. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. నా వ్యక్తిగత జీవితంలోకి దూరకండి అంటూ మీడియాకు అమల ఘాటుగా లేఖ రాసింది.

     సమంత అక్కినేని కూడా..

    సమంత అక్కినేని కూడా..

    ఇటీవల బికినీలో సేద తీరుతూ ఉన్న ఫొటోను సమంత అక్కినేని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. దానికి ఘాటుగా సమాధానమిస్తూ.. మీ పని మీరు చేసుకోండి. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకండి అని సమంత సూచించారు.

    English summary
    India has seen the worst of entertainment journalism. While BollywoodLife refrained from sensationalising reportage about Sridevi’s demise and revealing sensitive details, a plethora of other news channels and portals did their best to milk the opportunity. Bollywood actresses are often subjected to extreme malicious scrutiny. Recently Amala Akkineni took to her Facebook page to share a heartfelt message talking about the scrutiny faced by actresses. “Will you let me age gracefully?” she asks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X