»   » రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అక్కినేని అమల గిఫ్ట్

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అక్కినేని అమల గిఫ్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఎంత క్లోజ్ గా ఉంటారో కొత్తగా చెప్పక్కర్లేదు. అనేక సందర్భాల్లో చిరంజీవి, నాగార్జున గుడ్ రిలేషన్ షిప్ షేర్ చేసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని అమల జంతు ప్రేమికులైన రామ్ చరణ్-ఉపాసన దంపతులకు రేర్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒంటె(క్యామెల్)ను గిఫ్టుగా ఇచ్చినట్లు సమాచారం.

అమల అందించిన గిఫ్టును సంతోషంగా స్వీకరించిన రామ్ చరణ్-ఉపాసన దంపతులు..... తమ కుటుంబంలోకి మరో వ్యక్తి వచ్చినట్లు హ్యాపీ ఫీలవుతున్నారట. దాని బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఓ సర్కస్ కంపెనీ నుండి ఆ ఒంటెను కొనుగోలు చేసి ఉపాసనకు గిఫ్టుగా ఇచ్చిందట అమల.

Amala Akkineni gifted a camel to Mega couple

అమల మాదిరిగానే రామ్ చరణ్-ఉపాసన దంపతులు కూడా గొప్ప జంతు ప్రేమికులు. వారి వద్ద ఇప్పటికే గుర్రాలు, కుక్క పిల్లలు, లేగ దూడలతో పాటు చాలా రకాల పెట్స్ ఉన్నాయి. తమకు ఖాళీ సమయం దొరికితే ఫాం హౌస్‌లో వాటితో గడుపుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రంలో చిరంజీవి కూడా అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
The buzz is that Amala Akkineni has gifted a camel to mega couple Ram Charan and Upsana.
Please Wait while comments are loading...