twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మన్మథుడు 2’ చూసిన తర్వాత అమల రియాక్షన్ ఇదీ.. కూర్చోలేకపోయానంటూ..

    |

    టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

    పూర్తి ఫారెన్ బ్యాగ్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఎక్కువైందన్న టాక్ వినిపించింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ సినిమా.. సెకెండాఫ్ మాత్రం సాగదీతగా అనిపించిందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున యంగ్‌గా కనిపించడం వల్ల వాళ్లిద్దరి జోడీ కన్విన్సింగ్‌గా ఉందని చెబుతున్నారు. అయినా, ఈ సినిమాలోని కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చదని సినీ విమర్శకులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 'మన్మథుడు 2'ను అక్కినేని నాగార్జున భార్య అమల వీక్షించారు. అనంతరం ఈ సినిమాపై ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ''సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్‌ చిత్రం. అద్భుతంగా ఉంది'' అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కినేని అభిమానులు సంతోష పడుతున్నారు.

    Amala Akkineni tweet about Manmadhudu 2

    ఇదలాఉండగా, 'మన్మథుడు 2' సినిమా మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.5.03 కోట్ల షేర్‌ సాధించిందని చిత్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రూ.3.86 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఇక, లాంగ్ వీకెండ్ కావడానికి తోడు సోమవారం కూడా హాలిడే రావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ అంటోంది.

    English summary
    Akkineni Nagarjuna, Rakul Preet Singh and Jhansi starrer Manmadhudu 2 is arriving at the theaters on 9th August. The movie has completed the censor formalities and has received ‘U/A’ certificate from the censor board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X