For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో విధవరాలుగా అమల

  By Srikanya
  |

  హైదరాబాద్ ఈ సినిమాలో నేను 'విడో' (విధవరాలు)ని. ఉద్యోగం చేసుకుంటూ, ముగ్గురు పిల్లల్ని పెంచుతుంటాను. పైకి సున్నితంగా కనిపించినా లోపల మాత్రం చాల పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళని. ఈ పాత్ర చాలామందిని ఇన్‌స్పయిర్ చేస్తుంది. ఈ చిత్రంలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించాను. అలాగే నాకు కొడుకు ఉన్నాడు కానీ కూతుళ్లు లేరు. మనకే కనుక కూతుళ్లు ఉండి ఉంటే.. వాళ్లతో మనం ఇలానే ఉండేవాళ్లమేమో అనే ఫీల్ ఈ షూటింగ్ చేసినప్పుడు కలిగింది అంటూ చెప్పుకొచ్చింది అమల.

  ఇక ''మనది కాని జీవితంలోకి తొంగి చూసే అవకాశం నటులకు మాత్రమే ఉంటుందేమో. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. ఇందులో నటిస్తున్నంతసేపూ ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదించిన అనుభూతి కలిగింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగిన ఓ వితంతువుగా కనిపిస్తాను. పిల్లల్లో మంచితనాన్ని బయటికి తీసుకొచ్చే గృహిణి పాత్ర పోషించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నటించాక తెలిసింది. చూడ్డానికి సాధారణంగా ఉన్నా... మానసిక ధృడత్వం కలిగిన మహిళగా నటించాను. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఓ మంచి పాత్రలో నటించానన్న తృప్తి నాకు కలిగింది'' అని చెప్పుకొచ్చింది.

  వాస్తవానికి శేఖర్‌గారు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు. కానీ ఆయన పట్టువిడవకుండా అడిగేవారు. ఈ చిత్రం 'ఇలా ఉంటుంది' అని చెప్పే రీతిలో ఆయన కొంతమంది పిల్లలతో చిన్నపాటి వీడియో షూట్ చేశారు. అది చూసి, ఇంప్రెస్ అయ్యాను. పైగా ఏడే రోజులు షూటింగ్ చేస్తే చాలన్నారు. కానీ ఏడు రోజుల్లో పూర్తవ్వలేదు. నాకు సినిమాలు కొత్త కాదు. ఇక్కడున్న సాధకబాధకాలు బాగా తెలుసు. ఈ సినిమా చేస్తున్నానని నాగార్జునతో అనగానే, 'నా సినిమాల్లో చెయ్యమంటే చెయ్యలేదు' అంటూ సరదగా నవ్వారు. బాగా చెయ్యమని ప్రోత్సహించారు. పేపర్‌లో వచ్చిన న్యూస్ చూసి, 'ఏంటీ.. యాక్ట్ చేస్తున్నావా?' అని అమ్మ అడిగితే, 'ఏదో చిన్న రోల్ చేశానులే. చాలా బాగుంటుంది' అని చెప్పాను అన్నారు.

  దాదాపు ఇరవయ్యేళ్ల గ్యాప్ తర్వాత అమల వెండితెరపై కనిపించబోతున్న చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. నూతన తారలతో అమీగోస్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజిత్, సుధాకర్, కౌశిక్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజయ్ తదితర నూతన తారలు పరిచయమవుతున్నారు.

  English summary
  Amala Akkineni will be seen as a widow in her comeback film 'Life Is Beautiful'. She plays the mother of three children and her character is that of an independent, strong woman who is full of positivity despite facing several odds in her life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X