For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ధనూష్‌తో రిలేషన్‌పై అమలా పాల్ కామెంట్స్.. రాంగ్ స్టేట్‌మెంట్‌తో ఇరుక్కుపోయిన హీరోయిన్

  By Manoj
  |

  అమలా పాల్.. దక్షిణాదిలో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. అంతగా అన్ని ఇండస్ట్రీలలో ప్రభావం చూపిస్తోందీ బ్యూటీ. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించిన ఈ బ్యూటీ.. తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఎక్కువ పేరును సంపాదించుకుంది. అదే సమయంలో ఇతర ఇండస్ట్రీలోనూ వరుస విజయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ అంశం దక్షిణాదిలోనే హాట్ టాపిక్ అయింది. దీనికి క్లారిటీ ఇచ్చే సమయంలో అమలా పాల్ ఇరుక్కుంది. ఆ సంగతులేంటో చూద్దాం.!

  ఇక్కడ అమలా పాల్‌కు తప్పని నిరాశ

  ఇక్కడ అమలా పాల్‌కు తప్పని నిరాశ

  అమలా పాల్ ‘నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె.. అక్కడ పలు చిత్రాల్లో నటించింది. ఇక, తెలుగులోకి మాత్రం నాగ చైతన్య నటించిన ‘బెజవాడ' అనే సినిమాతో ఎంటర్ అయింది. ఆ తర్వాత ‘నాయక్', ‘ఇద్దరమ్మాయిలతో' ‘జెండాపై కపిరాజు' అనే సినిమాల్లో నటించినా ఏ ఒక్కటి హిట్ అవలేదు.

  బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమాయణం

  బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమాయణం

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమాయణం సాగించింది. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో అగ్నిసాక్షిగా ఒక్కటైన ఈ జంట.. నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అయితే, ఆ విడాకులకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఈ క్రమంలోనే దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అయ్యాయి.

  న్యూడ్ షోతో రెచ్చిపోయిన అమలా పాల్

  న్యూడ్ షోతో రెచ్చిపోయిన అమలా పాల్

  విజయ్‌తో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన అమలా పాల్.. విడాకుల తర్వాత మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలోని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘ఆమె/అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె న్యూడ్‌గా నటించడం హాట్ టాపిక్ అయింది.

  అమల - విజయ్ విడాకులకు కారణం ధనుష్

  అమల - విజయ్ విడాకులకు కారణం ధనుష్

  అమలా పాల్ - విజయ్ విడాకులకు కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే, ఇటీవల విజయ్ తండ్రి అళగప్పన్ మాత్రం దీనిపై స్పందించారు. తన కొడుకు కోడలు విడాకులు తీసుకోవడానికి కారణం తమిళ స్టార్ హీరో ధనూష్ అంటూ ఆయన బాంబ్ పేల్చారు. ధనుష్ సినిమా విషయంలో అమలా పాల్‌ తమను ఎదిరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.

  తన విడాకులకు అసలు కారణం చెప్పేసింది

  తన విడాకులకు అసలు కారణం చెప్పేసింది

  అళగప్పన్ చేసిన ఆరోపణలపై అటు ధనుష్ గానీ, ఇటు విజయ్, అమలా పాల్ గానీ స్పందించలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ హీరోయిన్ సమాధానం చెప్పక తప్పలేదు. మాజీ మామ చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన అమల.. తమ విడాకులకు కారణం ధనూష్ ఏమాత్రం కాదని, వ్యక్తిగత కారణాలతోనే విడిపోయామని వెల్లడించింది.

  Reason Behind Amala Paul And Director AL Vijay Seperation | Filmibeat Telugu
  ధనూష్‌తో రిలేషన్‌పై కామెంట్స్‌తో ఇరుక్కుంది

  ధనూష్‌తో రిలేషన్‌పై కామెంట్స్‌తో ఇరుక్కుంది

  ఇదే ఇంటర్వ్యూలో ధనూష్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది అమల. ‘ధనూష్ నాకు మంచి స్నేహితుడు. స్టార్ హీరోనే అయినా అందరితో కలివిడిగా ఉంటాడు. భవిష్యత్‌లో మా ఇద్దరి బంధం చాలా దూరం వెళ్తుంది' అని చెప్పుకొచ్చింది. అమలా పాల్ సినిమా గురించి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చాలా మంది నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో అమల మరోసారి ఇరుక్కున్నట్లు అయింది.

  English summary
  Amala Paul is an Indian film actress who works in the South Indian Film Industry. After appearing in supporting roles in the Malayalam film Neelathamara. Amala became noted after playing the title role in Mynaa, receiving critical acclaim for her work.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X