»   » వేధింపులు: అమలాపాల్ హనీమూన్ ఫోటోలు డిలీట్!

వేధింపులు: అమలాపాల్ హనీమూన్ ఫోటోలు డిలీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో...అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సినీతారలు తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అదే సమయంలో ఈ సోషల్ మీడియా వల్ల ఒక్కోసారి ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్ అమలా పాల్ తాజాగా ఇబ్బందుల పాలైంది.

ఇటీవల దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లాడిన ఆమె తమ పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇద్దరూ కలిసి హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. తమ హమీమూన్ మాల్దీవుల్లో జరుపుకుంటున్నామనే విషయాన్ని తెలియజేస్తూ అమలా పాల్ కొన్ని ఫోటోలు పోస్టు చేసింది.

ఈ ఫోటో పోస్టు చేయగానే కొందరు అభిమానులు అభినందనలు చెబుతూ కామెంట్స్ చేయగా....కొందరు మాత్రం అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు, ఆమెకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసారు. దీంతో అమలా పాల్ చాలా అప్ సెట్ అయింది. వెంటనే తమ హనీమూన్ ఫోటోలు డిలీట్ చేసింది.

అమలా పాల్

అమలా పాల్

బహుషా తన అభిమానుల నుండి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని అమలా పాల్ ఊహించి ఉండదు. ఊహిస్తే ఇలాంటి ఫోటోలు పోస్టు చేసిది కాదు.

డిలీట్ చేసింది

డిలీట్ చేసింది

తనను ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ వస్తుండటంతో వెంటనే అమలా పాల్ ఆ ఫోటోలను డిలీట్ చేసింది. అప్పటికే ఆ ఫోటోలు వేలాది మంది వీక్షించారు.

పెళ్లి

పెళ్లి

ఇకపోతే....అమలా పాల్-ఏఎల్ విజయ్ వివాహం ఈ నెల 12న చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే.

హిందూ సాంప్రదాయం ప్రకారం

హిందూ సాంప్రదాయం ప్రకారం

ఏఎల్ విజయ్ హిందు, అమలా పాల్ క్రిస్టియన్. అయితే వీరి ఎంగేజ్మెంట్ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.

ప్రేమ పక్షులు

ప్రేమ పక్షులు

ఏఎల్ విజయ్, అమలా పాల్ మద్య గత కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అమలా పాల్ పలు చిత్రాల్లో నటించింది.

English summary
Social media is a double-edged sword and time and again it has been proven. Celebs enter Facebook and Twitter to communicate with their fans and to have good interaction with their followers. While it is the positive side, the negative side of it is that they get constantly abused by their own followers. Latest victim is none other than newly married Amala Paul.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu