»   » రూ. కోటి క్లబ్బులో చేరిన మెగా హీరోయిన్

రూ. కోటి క్లబ్బులో చేరిన మెగా హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ చివరగా తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా రామ్ చరణ్ తేజ్ 'నాయక్', అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'ఇద్దరమ్మాయిలతో'. వరుసగా ఇద్దరు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు నటించి చిత్రాల్లో అవకాశం దక్కించుకుని మెగా హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది ఈ కేరళ కుట్టి.

ప్రస్తుతం అమలపాల్ నటించిన 'జండాపై కపిరాజు' అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. నాని హీరోగా నటించిన ఈచిత్రానికి సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది అమలాపాల్. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమలాపాల్ రెమ్యూనరేషన్ రూ. కోటికి చేరిందని తెలుస్తోంది.

Amala Paul enters Rs 1 crore club

త్వరలో ఆమె నటించబోయే ఓ తెలుగు సినిమాకు రూ. కోటి పారితోషికం తీసుకోబోతోందని అంటున్నారు. 'వస్తా నీ వెనక' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో 'జీనియస్' ఫేం హవీస్ హీరోగా నటించనున్నాడు. రామదూత సినీ క్రియేషన్స్ బేనర్లో దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఈతరం ప్రేక్షకులు మెచ్చే విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఉంటుందని, సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ యూరఫ్‌లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో అమలా పాల్ తో పాటు 'అంతకు ముందు ఆ తరువాత' ఫేం ఇషా కూడా నటించనుంది.

English summary
According to sources, actress Amala Paul, who is popular in Telugu and Tamil has received 1 crore as remuneration for upcoming Telugu film Vastha Nee Venuka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu