»   » డైరెక్టర్‌తో ఎఫైర్, అమలా పాల్ అలా దొరికిపోయింది...(ఫోటోలు)

డైరెక్టర్‌తో ఎఫైర్, అమలా పాల్ అలా దొరికిపోయింది...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బెజవాడ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.... లవ్ ఫెయిల్యలూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలా పాల్ త్వరలో పెళ్లికి రెడీ అవుతోంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో గత కొంత కాలంగా ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన ఆమె త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతోంది.

అమలా పాల్-ఎ.ఎల్. విజయ్ పెళ్లి విషయాన్ని అమలా పాల్ తల్లి అనీస్ పాల్ ఓ మేగగైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తన కూతురు అమలా పాల్ దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయాన్ని తాను ఎలా తెలుసుకున్నాననే విషయాన్ని అనీస్ పాల్ సదరు మేగజైన్‌కు వివరించారు.

అమలా పాల్ ఫోన్ బిల్లు పరిశీలించిన అనీస్ పాల్ అందులో...ఎక్కువ కాల్స్ దర్శకుడు విజయ్‌తో మాట్లాడినట్లు ఉంది. అయితే విజయ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో అమలా పాల్ నటించడంతో తొలుతు ఆమెకు పెద్దగా అనుమానం రాలేదు. ఆ తర్వాత అమలా పాల్ వ్యవహారం పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట.

తల్లిదండ్రులను కన్విన్స్ చేసిన అమలా పాల్

తల్లిదండ్రులను కన్విన్స్ చేసిన అమలా పాల్

దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయం ఇంట్లో తెలియడంతో తమను అమాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందని....ఆ తర్వాతా తాము ఒప్పుకోక తప్పలేదని అనీస్ పాల్ చెప్పుకొచ్చింది.

చెన్నైలో వివాహం

చెన్నైలో వివాహం

అమలా పాల్-విజయ్ వివాహం చెన్నైలో జరుగుతుంది, అయితే ఎంగేజ్మెంట్ మాత్రం కొచ్చిలో జరుపుతామని అనీస్ పాల్ తెలిపారు. జూన్ నెలలో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.

వీరి మధ్య ఎలా మొదలైంది

వీరి మధ్య ఎలా మొదలైంది

2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఓ తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన ‘నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

తలైవా చిత్రంలో హీరోయిన్‌గా...

తలైవా చిత్రంలో హీరోయిన్‌గా...

అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్....తమిళ హీరో విజయ్‌తో తీసిన ‘తలైవా'(తెలుగులో ‘అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు.

గతంలో ఖండించారు

గతంలో ఖండించారు

గతంలో వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన చాలా మంది విషయాన్ని బయటకు లీక్ చేసారు. మీడియాలో కూడా ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వారు ఈ విషయాన్ని అంగీకరించక పోగా, తమ మధ్య అలాంటిదేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేసారు.

English summary
We have finally got a confirmation about Amala Paul's relationship. Her mother herself has revealed about the actress' affair with director Vijay. Speaking to a magazine, Anees Paul has opened up on how she caught her daughter's hide and seek game with her beau!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu