త్రిషను కాదని అమలపాల్ కే ఆఫర్ కన్ఫర్మ్
ఇటీవలే లాంఛనంగా సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అప్పుడు హీరోయిన్ ఎవరనేది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. ప్రస్తుతం అమలాపాల్ తమిళంలో విజయ్, తెలుగులో నాని చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు సూర్యతో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కీ స్థానం ఉన్నట్లు తెలిసింది. సూర్య తల్లిగా సిమ్రాన్ కనిపించబోతోంది. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
సిమ్రాన్, పార్తీపన్, సుధాంశు పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. సూర్యతో కలిసి త్రిష నటించే మూడో చిత్రమిది. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, గౌతమ్ మీనన్ చిత్రాలకు సైతం తెలుగులో బిజినెస్ ఉండటం కలిసి వచ్చే అంశం.
నాగచైతన్యతో... ' ఏమి మాయ చేసావే ' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దర్శకుడు స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన చిత్రాలుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రం కమిటయ్యారుయ. గతంలో 'కాక్క కాక్క'(తెలుగు ఘర్షణ) తో సూర్య కి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆయన మరోసారి సూర్యతో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు.
'కాక్క కాక్క' తర్వాత సూర్యతో ... 'వారనం ఆయిరం' చేసినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ సూర్య మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది గౌతంమీననే. వీరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మూడోసారి ముచ్చటగా వీరు కలిసి పనిచేయనున్నారు.


Click it and Unblock the Notifications












