Don't Miss!
- News
మావోయిస్టుల ఘాతుకం: ఫ్యామిలీ ముందే గొడ్డళ్ళతో నరికి బీజేపీ నేత దారుణ హత్య
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎంటర్ కావద్దంటూనే యమ రెచ్చిపోయిందిగా.. బాబోయ్.. ఇదేం పోస్టర్!
Recommended Video
అమలా పాల్.. ప్రస్తుత పరిస్థితుల్లో బాగా వినిపిస్తున్న పేరిది. దీనికి కారణం తాజాగా ఆమె నటించిన చిత్రమే. ప్రస్తుతం అమలా పాల్ 'అడై' అనే సినిమాలో నటించింది. దీన్నే తెలుగులో 'ఆమె' అనే టైటిల్‌తో తీసుకు వస్తున్నారు. ఒకేసారి రెండు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో అమలా పాల్ నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాపై రెండు భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి.

వివాదాలు - ప్రమోషన్
ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచే దీని చుట్టూ ఎన్నో వివాదాలు అలముకున్నాయి. యువతను తప్పుదోవ పట్టిస్తుందని చాలా మంది విమర్శలు చేశారు.ఇంతటి వివాదాలు నడుస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అమలా పాల్ కూడా వాటిని లైట్ తీసుకుంటోంది. అంతేకాదు, సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కోసం అమలా పాల్ హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.

కేసు నమోదు
మలాపాల్ నటించిన ఆడై చిత్రంలోని నగ్న దృశ్యాలు, ఆ చిత్ర పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆడై చిత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

రిలీజ్ పోస్టర్‌తో వచ్చేసింది
ఒకవైపు వివాదాలు.. మరోవైపు ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇలాంటి పరిస్థితుల్లో ‘అడై' బృందం తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. సినిమా రిలీజ్ పోస్టర్ అని చెబుతున్న దీనిలో అమలా పాల్ గెటప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘డు నాట్ ఎంటర్' అని ఉండే క్లాత్‌ను చుట్టుకుని ఆమె ఇందులో కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుశీలతో భక్తి పాట
ఈ సినిమాలో ఓ భక్తి పాటను చూపించబోతున్నారు. అమలాపాల్ నగ్నంగా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రారనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ పాట ఎవరు పాడారో తెలుసా..? తన గాత్రంలో ఎంతో మందిని మెప్పించిన ప్రముఖ నేపథ్య గాయని, గాన కోకిల పీ సుశీల. అవును ఆమె ఈ పాటను పాడారు.

సినిమా గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.