Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పెళ్లి చేసుకోకుండానే కాపురం మొదలెట్టిన అమలా పాల్.. మరీ ఇంత పచ్చిగానా?
అమలా పాల్.. గతంలో ఈ పేరును పెద్దగా పలికే వారు కాదు కానీ, 'అడై' సినిమాతో మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించడం వల్ల ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అలాగే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కనిపించింది. దీంతో 'అడై'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 'అడై' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, అది ఓవర్సీస్‌లోనే. ఇక్కడ సినిమా విడుదల కాలేదు.

మిశ్రమ స్పందన
శుక్రవారం ఓవర్సీస్‌లో రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, తమ టార్గెట్ అయిన యువతకు సినిమా బాగా రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

తమ్మారెడ్డి ఫిదా
కొద్దిరోజుల క్రితం ఈ సినిమా చూసిన టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. అమలాపాల్ నటనకు ముగ్ధుడయ్యారు. అంతేకాదు, తన 40 సంవత్సరాల అనుభవంలో ఇలా పెర్ఫామ్ చేసే నటిని ఇంతవరకూ చూడలేదని ఆయన అన్నారు. అలాగే, మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.

లవర్‌తో కాపురం
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాను మళ్లీ ప్రేమలో పడ్డానని, అయితే ఆ వ్యక్తి సినిమా రంగానికి చెందిన వారు కాదని అమలా పాల్ తెలిపింది. తాజాగా దీనిపై మరింత క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమలో పడ్డానని, ప్రస్తుతం అతనితో పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నానని చెప్పింది. అలాగే, ప్రస్తుతం తాను ఇలా ఉండటానికి కారణం ఆయనేనని, తాను చాలా అప్సెట్‌లో ఉన్న సమయంలో అతని పరిచయం ఏర్పడిందని తెలిపింది. తన గురించి అతనికి అన్ని విషయాలు బాగా తెలుసునని, తన కెరియర్ కోసం అతను ఉద్యోగం కూడా వదులుకున్నారని తన ప్రియుడు గురించి తెలిపింది. అయితే అయిన పేరు మాత్రం బయట పెట్టలేదు.

కేసు నమోదు
మలాపాల్ నటించిన ఆడై చిత్రంలోని నగ్న దృశ్యాలు, ఆ చిత్ర పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆడై చిత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె సినిమాలో నగ్నంగా నటించడంతో పాటు, పచ్చిగా మాట్లాడుతుండడంతో పలువురు ఫైర్ అవుతున్నారు.

అడై గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.