వైఎస్ ఫ్యామిలీ డ్రామా : విజయమ్మగా నటి ఆమని!

'జగన్నాయకుడు' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విజయమ్మ పాత్రకు మాజీ హీరోయిన్, నటి ఆమని పోషించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జగన్ పాత్రను 'వెన్నెల', 'ఆనంద్' చిత్రాల ఫేం రాజా పోషించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కాన్సెప్టు విషయానికొస్తే...తాత, కొడుకు, మనవడు... ఇలా మూడు తరాలకు చెందిన కథ ఇది. తాత కోరికను మూడో తరంలో మనవడు నెరవేర్చడం ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి కథను అందించారని పిసి రెడ్డి తెలిపారు.
అలాగే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అనూరాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించే రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పి.సి.రెడ్డి చెప్పారు. అంతా కొత్త వారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. శ్రీనివాసరావుగారి ప్రోద్బలం దీనికి ముఖ్య కారణం. ఈ చిత్రానికి కథకుడు కూడా ఆయనే. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











