Don't Miss!
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
'అమరావతి'హాలీవుడ్ సినిమానా? రవిబాబు క్లారిఫికేషన్
అల్లరి రవిబాబు దర్శకత్వంలో రెడీ అయి రిలీజవుతున్న అమరావతి చిత్రం గురించి నిర్మాత చెబుతూ ఇది హాలీవుడ్ రేంజిలో ఉంటుంది అన్నారు. దాంతో ఈ చిత్రానికి ఏదన్నా హాలీవుడ్ చిత్రం స్పూర్తా అనే సందేహం మీడియాలో కలిగింది. ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ..ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే...హాలీవుడ్ సినిమాలా ఉంది అనుకోవడం సహజమే. మా నిర్మాత ఆనంద్ ప్రసాద్ అలా అనడానికి కారణం ఉంది. చిత్రీకరణ శైలి...ఎంచుకున్న కథ...కొత్త తరహాలో ఉంటాయి కాబట్టి హాలీవుడ్ స్థాయి అన్నారు. అయినా మన సినిమాలు హాలీవుడ్ కంటే ఏం తక్కువ చెప్పండి. వాళ్ల దగ్గర విజువల్ ఎఫెక్ట్స్ చేసే నిపుణులు ఎక్కువ మంది ఉండొచ్చు...వాటిని భారీగా చూపించేంత బడ్జెట్ ఉండొచ్చు...అందుకు తగ్గ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకొంటారు. మన భారతీయ చిత్రసీమకు ఉన్న పరిమితుల రీత్యా అంతటి సాంకేతికపరమైన హంగామాను చూపించలేకపోవచ్చు. హాలీవుడ్ వాళ్లని మించిన కథలు మన రచయితల దగ్గర ఉన్నాయి అన్నారు. భూమిక, స్నేహ, గద్దె సింధూర, తారకరత్న ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం రేపే(గురువారం)ప్రేక్షకుల ముందుకొస్తుంది.