»   » సారే జహా సే అచ్చా..... భారత్ కీ బయోపిక్ :అమీర్ తర్వాతి సినిమా ఇదే

సారే జహా సే అచ్చా..... భారత్ కీ బయోపిక్ :అమీర్ తర్వాతి సినిమా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాకేష్ శర్మ విషయానికి వస్తే అంతరక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఆయన. 1984 ఏప్రియల్ 3న రష్యాకు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి , బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రపంచపు వ్యోమగాములల్లో రాకేష్ శర్మ..138 వ వాడు. ఈ ప్రయాణంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ..రాకేష్ శర్మను అక్కడనుంచి భారతదేశం నుంచి ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు..

రాకేష్ శర్మ...సారే జహాసే అచ్చా..హిందూస్తా హమారా అని చెప్పి దేశభక్తిని చాటి చెప్పారు. (అయితే అది ముందే అనుకున్న ప్రకారమే ఆయనలా చెప్పారని తర్వాత తెలిసింది) ఇప్పుడు అమీర్ ఖాన్ ఆ నాటి గోల్డెన్ మెమెరీస్ ని వెండితెరపై చూపనున్నాడు. ఆస్కార్ ను సైతం ఈ సినిమా టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు. ఓ ప్రక్కన బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఖచ్చితంగా సినిమా ప్రియులను అలరిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు,ఎవరు నిర్మిస్తారు, బడ్జెట్ ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా బయిటకు రాలేదు కానీ సినిమా మాత్రం పక్కా గా ఫిక్స్ అయిపోయినట్టే నట... మిగతా విశేషాలు..

మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్:

మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్:

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా త్వరలోనే మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. నిజ జీవిత కథలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాలను రూపొందించడానికి దర్శక, నిర్మాతలు పోటీపడుతున్నారు. అసలు విషయానికొస్తే... బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో ఓ బయోపిక్ చిత్రంలో కనిపించనున్నాడు.

తొలి భారతీయ వ్యోమగామి:

తొలి భారతీయ వ్యోమగామి:

ఇంతకీ ఎవరి బయోపిక్‌లో నటిస్తున్నాడో తెలుసా..? ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మలా కనిపించనున్నారట. ఈ సినిమాలో వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్రను చూపించనున్నారు. రాకేష్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అంతరక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఆయన.

రాకేష్ శర్మ జీవిత గాథ:

రాకేష్ శర్మ జీవిత గాథ:

ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే అమీర్ ఈ కొత్త ప్రయోగం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వ్యోమగామి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత గాథ ఆధారంగా రూపొందించే చిత్రంలో అమీర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న మరో చిత్రం 'దంగల్' ఈ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అంతరిక్షంలోకి వెళ్లాడు:

అంతరిక్షంలోకి వెళ్లాడు:

1984 ఏప్రియల్ 3న రష్యాకు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి, బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రపంచపు వ్యోమగాములల్లో రాకేష్ శర్మ..138 వ వాడు. అంతరిక్షంలో ఆయన చేసిన సాహసాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని అమీర్ ఖాన్ భావిస్తున్నాడట.

తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీ:

తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీ:

ఒక వేళ ఇదే కనుక నిజమైతే తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటికే అమీర్‌ను ''ఆస్ట్రోనాట్'‌'గా మార్చిన అభిమానులు ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. భారత చలన చిత్రపరిశ్రమలోనే ఇది అతిపెద్ద సాహస చిత్రంగా కానుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

రాకేష్ శర్మ కుమారుడు కపిల్ శర్మ :

రాకేష్ శర్మ కుమారుడు కపిల్ శర్మ :

రాకేష్ శర్మ కుమారుడు కపిల్ శర్మ కూడా సినిమాల్లో డర్శకుడి గా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాకేష్ శర్మ కుమారుడు కపిల్ శర్మ తొలిసారిగా హిందీలో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. జాన్ అబ్రహం హీరోగా కపిల్ తెరకెక్కించిన 'ఐ, మీ ఔర్ మైన్' అనే ఈ సినిమా ఇప్పుడు విజయఢంకా మోగించింది. స్టార్లు పెద్దగా లేని ఈ ప్రేమకథా చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, బాలీవుడ్ జనాలను ఆశ్చర్యపరిచింది.

English summary
Now the sources say that Aamir's next film will be also a biopic like Dangal, based on the first Indian astronaut in outer space Rakesh Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu