For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాలచందర్‌ను కలిసిన అమీర్‌ఖాన్‌....అరగంట మీటింగ్

  By Srikanya
  |

  చెన్నై : 'దర్శక శిఖరం' కె.బాలచందర్‌ను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అరగంట పాటు వీరి భేటీ జరిగింది. తన చిత్ర విశేషాల గురించి అమీర్‌ఖాన్‌ ఆయనతో ముచ్చటించారు. 'ధూమ్‌ 3' చిత్రం, 'సత్యమేవ జయతే' టీవీ కార్యక్రమాలపై వారు మాట్లాడినట్లు సమాచారం. గొల్లపూడి అవార్డు కార్యక్రమంలోని తీపి గురుతులను బాలచందర్‌తో అమీర్‌ పంచుకున్నారు.

  ఇక 'ధూమ్‌-3' సినిమాలో అమీర్‌ ఖాన్‌ కొత్త తరహా నృత్యం చేశారు. ఇంతకీ అదేమిటో తెలుసా..? ట్యాప్‌ డ్యాన్స్‌! దీని గురించి తెలియాలంటే డిసెంబరు 20 వరకూ ఆగాల్సిందే. అప్పుడే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నృత్యం నేర్చుకొనేందుకు అమీర్‌ ఖాన్‌ ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చారట. అక్కడే ప్రముఖ డ్యాన్సర్‌ డీన్‌ పెర్రీ దగ్గర ఈ తరహా నృత్యం అభ్యసించారు.

  'ధూమ్‌-3' సినిమా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ''ఆస్ట్రేలియాలోని డీన్‌ పెర్రీ అకాడెమీలో ట్యాప్‌ డ్యాన్స్‌ నేర్చుకొనేందుకు అమీర్‌ ఖాన్‌ వెళ్లారు. అక్కడ్నుంచి తిరిగి వచ్చిన తరవాత ఓ పాటను చిత్రీకరించాం. అందులో ఆయన ఈ తరహా నృత్యం చేశారు. డీన్‌ పెర్రీ ఆస్ట్రేలియాలో పేరున్న కొరియోగ్రాఫర్‌. ఆయనకు ఈ నృత్యంలో మంచి పేరుంది. అమీర్‌ కూడా ఈ ట్యాప్‌ డ్యాన్స్‌కు తనదైన శైలిని జోడించి తెరపై అద్భుతంగా నర్తించారు''అని తెలిపారు.


  అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఉదయ్‌ చోప్రా కీలక పాత్రలు పోషించిన 'ధూమ్‌-3'ని విజయ్‌ కృష్ణ ఆచార్య రూపొందించారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  Ameer Khan met Director Bala Chandar

  ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

  English summary
  
 Aamir Khan who met K.Balachander at his residence as a Courtesy Meeting. The director wished him for his upcoming Dhoom 3 and Congratulated for his Satyamev jayate which was telecasted in a private Channel. Aamir Khan was exicted and happy to hear from KB sir and he remembered his Excellent Speech in Gollupudi Awards and he has a Video and Keep showing to his friends in the Industry. The Meeting lasted for 30 minutes. 
 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more