»   » పవన్ హీరోయిన్...ఈ ‘ఆకతాయి’ వేషాలేంటో? (ఫోటోస్)

పవన్ హీరోయిన్...ఈ ‘ఆకతాయి’ వేషాలేంటో? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో 'బద్రి' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ టాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయం అప్పట్లో అమీషా అందానికి పవన్ ఫ్యాన్స్ అంతా పడిపోయారు.

ఆ సినిమా తర్వాత అమీషాకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనుకున్న ఆమె ఆ తర్వాత బ్యాడ్ లక్కో.. మరేదో తెలియదు కానీ కెరీర్ పరంగా కలిసి రాలేదు. బాలీవుడ్లోనూ అమ్మడికి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు.

ప్రస్తుతం అమీషా వయసు 40 ప్లస్... ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ కాకుండా ఇతర ముఖ్య పాత్రలు చేస్తూనే ఐటం సాంగులు కూడా చేస్తోంది. తాజాగా అమీషా పటేల్ తెలుగు మూవీ 'ఆకతాయి'లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ హాట్ అండ్ సెక్సీగా లుక్ తో ఆకట్టుకుంటోంది.

ఆకతాయి

ఆకతాయి

ఆశిష్‌ రాజ్‌, రుక్సార్‌ మీర్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆకతాయి'. రామ్‌ భీమన దర్శకుడు. కౌశల్‌ కరణ్‌, విజయ్‌ కరణ్‌, అనిల్‌ కరణ్‌ నిర్మాతలు.

అమీషా స్పెషల్ సాంగ్

అమీషా స్పెషల్ సాంగ్

ఈ చిత్రంలో 'ఆకతాయి... ఆహ.. ఆహా' అనే స్పెషల్ సాంగ్ లో అమీషా పటేల్ నటిస్తోంది. అమీషాకు సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చైతన్యప్రసాద్‌ ఈ పాటను రచించారు.జ

జానీ మాస్టర్ ఆధ్వర్యంలో

జానీ మాస్టర్ ఆధ్వర్యంలో

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. నిన్న(బుధవారం) ఈ పాట చత్రీకరణ ప్రారంభం అయింది.

అమీషా ప‌టేల్ మాట్లాడుతూ

అమీషా ప‌టేల్ మాట్లాడుతూ

`పవన్ కళ్యాణ్ తో బ‌ద్రి సినిమా తర్వాత బాల‌కృష్ణ, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, వంటి స్టార్ హీరోలతో చేసే అవకాశం లభించింది. బాలీవుడ్లో సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. ఇపుడు ఆకతాయి సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నాను. ఈ సాంగ్ సినిమాలో కీ రోల్. అందుకే ఒప్పుకున్నాను. మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు రామ్‌భీమ‌న మాట్లాడుతూ...మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. చైత‌న్య ప్ర‌సాద్‌గారు రాసిన ఆక‌తాయి టైటిల్‌తో రాసిన సాంగ్‌లో అమీషా ప‌టేల్ వంటి స్టార్ హీరోయిన్ న‌టించ‌డం ఆనందంగా ఉంది. ప్రేమ, యాక్షన్‌లతో సాగే చిత్రమిది. ఆకతాయి కుర్రాడి జీవితంతో ఆడుకోవాలని చూసిన వారి ఆటల్ని ఆ కుర్రాడు ఎలా కట్టించాడనేది కథ. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రాని విధంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం`` అన్నారు.

హీరో ఆశిష్ రాజ్ మాట్లాడుతూ

హీరో ఆశిష్ రాజ్ మాట్లాడుతూ

ఈ సినిమా నేను చేయగనో లేదో అనుకున్నాను. కానీ దర్శ‌కుడు రామ్‌భీమ‌న‌గారు నాలో కాన్ఫిడెంట్‌ను నింపి నాతో సినిమాను చేయించారు. అమీషాప‌టేల్‌గారితో న‌టించ‌డం హ్యాపీగా ఉంది` అన్నారు.

నటీనటులు

నటీనటులు

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్‌, సుమ‌న్‌, నాగ‌బాబు, రాంకీ, రాశి, బ్ర‌హ్మానందం, అలీ, ప్ర‌దీఫ్ రావ‌త్‌, పోసాని, పృథ్వీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో అమీషా ప‌టేల్ స్పెష‌ల్‌సాంగ్ చేశారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ గంగ‌దారి, ఆర్ట్: ముర‌ళి కొండేటి, ఫైట్స్: నందు, ఎడిట‌ర్: ఎం.ఆర్‌.వ‌ర్మ‌, డ్యాన్స్: జానీ మాస్ట‌ర్‌, స్వ‌ర్ణ‌, స‌తీష్‌, అమిత్‌, నిర్మాత‌లు: విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రామ్ భీమ‌న‌.

హాట్ స్విమ్ సూట్ లో హీరోయిన్ అమీషా

హాట్ స్విమ్ సూట్ లో హీరోయిన్ అమీషా

హాట్ స్విమ్ సూట్ లో హీరోయిన్ అమీషా (ఫొటో కోసం కోసం క్లిక్ చేయండి)

అందాలతో అమీషా...ఎక్కిస్తుంది నిషా..!(ఫోటోలు)

అందాలతో అమీషా...ఎక్కిస్తుంది నిషా..!(ఫోటోలు)

అందాలతో అమీషా...ఎక్కిస్తుంది నిషా..!(ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Telugu Cinema Aakatayi Press Meet with Ameesha Patel. Ashish Raj, Ram Bheemana, Bunny Sathish, KR Vijay Karan, KR Koushal Karan and KR Anil Karan graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu