»   » ఆ ఇడియట్‌కి తల్లి, చెల్లి లేరేమో! పవన్ హీరోయిన్ ఫైర్!

ఆ ఇడియట్‌కి తల్లి, చెల్లి లేరేమో! పవన్ హీరోయిన్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీషా పటేల్ అంటే తెలుగు ప్రేక్షకులు ముందుగా గుర్తొచ్చే సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి'. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమీషా పటలే తొలి సినిమాతోనే ఇక్కడ హిట్టు కొట్టింది. అయితే ఆ తర్వాత అమ్మడుకి తెలుగులో కలిసి రాలేదు. అటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగలేక పోయింది.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అమీషా పటేల్ తన ట్విట్టర్ కామెంట్స్ తో హాట్ టాపిక్ అయింది. హిందీ టీవీ నటుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నా సమస్యను అర్థం చేసుకోకుండా టీవీ నటుడు కుషాల్ ఇండియట్ లా మాట్లాడుతున్నాడు, అతనికి తల్లి చెల్లి లేరేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడంటూ మండి పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల ముంబైలోని ఓ థియేటర్లో సినిమా చూడటానికి వచ్చింది అమీషా పటేల్. అదే థియేటర్ కు వచ్చిన కుషాల్ ఆమెను చూసిన విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేసాడు. ఈ మాత్రం దానికి కుషాల్ పై ఆమె ఇంతలా పండిందా? అనుకుంటే పొరపాటే. అమీషా మనసు గాయ పడే విధంగా కుషాల్ వ్యాఖ్యానించారు.

థియేటర్లో జాతీయ గీతం వస్తున్న సమయంలో ఓ అమ్మాయి గౌరవసూచకంగా నిలబడకుండా కూర్చొని ఉంది, తొలుత ఆమె వికలాంగురాలేమో అనుకున్నాను, కానీ ఆమె అమీషా పటేల్ కావడంతో ఆశ్చర్య పోయాను అంటూ ట్విట్టర్లో పోస్టు చేసాడు కుషాల్. అతని వ్యాఖ్యలకు ఘాటుగానే రిప్లై ఇచ్చింది అమీషా.

ఆడవాళ్లకు ఉండే నెలసరి సమస్యల కారణంగానే నేను ఆ రోజు లేచి నిలబడలేదు. ఈ సమస్యను అర్థం చేసుకోకుండా కుషాల్ ఓ ఇడియట్ లా మాట్లాడుతున్నాడు. కుషాల్ కు తల్లి చెల్లి లేరేమో? అందుకే ఆడవాళ్ల వ్యక్తిగత విషయాల గురించి పట్టించుకోకుండా ఇలా మాట్లాడుతున్నాడు అంటూ మండి పడింది.

కుషాల్ ఇడియట్


కుషాల్ ఇడియట్ అంటూ మండిపడ్డ అమీషా

నెలసరి సమస్య వల్లే..


నెలసరి సమస్య వల్లే నేను ఆ రోజు లేచి నిలబడలేక పోయానని తెలిపింది.

అమీషా ట్వీట్స్


అమీషా పటేల్ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ట్విట్టర్ వార్


అమీషా పటేల్, కుషాల్ టండన్ ట్విట్టర్ వార్

English summary
Ameesha Patel and Kushal Tandon's insane Twitter meltdown over national anthem.
Please Wait while comments are loading...