»   » 40-50 కథలున్నయ్.., నేను నటించను: అడివి శేష్

40-50 కథలున్నయ్.., నేను నటించను: అడివి శేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కేవలం బాగా నటించాదన్న ప్రశంసలు మాత్రం శేష్ కి దక్కాయి. 'అమీ తుమీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంత్ పాత్రలో తాను కనిపిస్తానని చెప్పాడు.

కామెడీ ఎంటర్టైనర్

కామెడీ ఎంటర్టైనర్

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను చేయడం తనకి ఇదే మొదటిసారి అని అన్నాడు. తనికెళ్ల భరణి .. అవసరాల .. వెన్నెల కిషోర్ వంటి వాళ్లతో కలిసి కామెడీ సీన్స్ చేయడానికి భయపడ్డానని చెప్పాడు. అయితే "నువ్ చేయగలవ్ .. " అంటూ ధైర్యం చెప్పి, తనతో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి చేయించారని అన్నాడు.

పవన్ కళ్యాణ్ పంజా తర్వాత

పవన్ కళ్యాణ్ పంజా తర్వాత

బాగానే చేశానని అనుకుంటున్నాననీ .. ఇక మార్కులు వేయడం ఆడియన్స్ చేతిలో ఉందని చెప్పుకొచ్చాడు. పంజా వరకూ పెద్దగా కనిపించలేదు గానీ పవన్ కళ్యాణ్ పంజా తర్వాత మరిన్ని అవకాశాలందుకున్నాడు. మొన్నటికి మొన్న బాహుబలి లోకూదా కొద్ది సేపే అయినా కీలకమైన పాత్రలోనే పాత్రేదక్కింది. ఈపుడు బాగానే బిజీ అయిపోయాడు. ఐతే నటనలో బిజీ అయినంత మాత్రాన తాను రైటింగ్ పక్కన పెట్టేయలేదని అంటున్నాడు శేష్.

40 కథల దాకా ఉన్నాయట

40 కథల దాకా ఉన్నాయట

అడివి శేష్ దగ్గర ప్రస్తుతం 40 కథల దాకా ఉన్నాయట.మళ్ళీ డైరెక్షన్ చేస్తారా అంటే.. చేస్తా కానీ అందులో నటించను. ఒక 40-50 కథలున్నాయి నా దగ్గర. అయితే.. వాటిలో పనికొచ్చేవి ఎన్ని అనేది మాత్రం తెలియదు. వాటిలో ‘ది బెస్ట్' అనుకున్నవి తీసి సినిమాలు చేస్తానని అంటున్నాడు శేష్. గత ఏడాది సూపర్ హిట్టయిన ‘క్షణం'కు స్క్రిప్టు అందించింది శేషే అన్న సంగతి తెలిసిందే.

బాహుబలి

బాహుబలి

ఇప్పుడతను కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గూఢచారి'కి కూడా అతనే కథ అందించాడట. మున్ముందు తన కథలతో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయని.. దర్శకుడిగానూ సక్సెస్ సాధించాలన్న ఆశ ఉందని చెప్పాడు శేష్. నటుడిగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ‘బాహుబలి'లో చిన్న పాత్రతో వచ్చిన గుర్తింపు అలాంటిలాంటిది కాదన్నాడు శేష్.

అమీతుమీ

అమీతుమీ

ఆ పాత్ర వల్ల తాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారని చెప్పాడు. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమీతుమీ'లో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులతో కలిసి చేయడం సవాలుగా మారిందని శేష్ అన్నాడు.

English summary
I almost had 40 stories with me but I am not sure when I will get them materialised. It’s been seven years that I entered the film industry. I learnt a lot over the years.” said Adivi Sesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu